AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే అంగీకరించేది లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే అంగీకరించేది లేదని ఆయన ..

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే అంగీకరించేది లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala
Subhash Goud
|

Updated on: Feb 18, 2021 | 8:55 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే అంగీకరించేది లేదని ఆయన అన్నారు. దీనిపై అవసరమైతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓటమి సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఓ ప్రతిపాదన చేస్తే దానిని ఎగతాళి చేయడం సరికాదని అన్నారు. పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు నాయుడుకు ఆరోపణలు చేయడమే తెలుసన్నారు.

చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయే సమయం వచ్చిందని, సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఓడితే ప్రజాస్వామ్య ఓటమి అంటారు.. వైసీపీ గెలిస్తే దుమ్మెత్తిపోస్తారని అన్నారు. మా పాలనకు బ్రహ్మరథం పట్టారనడానికి ఈ పంచాయతీ ఫలితాలే నిదర్శనమని అన్నారు.

Also Read: కుప్పంలో కోట్ల రూపాయల డబ్బులు పంచారు.. మూడో విడత పంచాయతీ ఫలితాలపై చంద్రబాబు ఆరోపణలు