Moto E7 Power Mobile: నేడే మోటో ఈ7 పవర్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం
Moto E7 Power Mobile: మోటోరోలా నుంచి మరో సరికొత్త ఫోన్ భారత్‌లో ఈ రోజు విడుదల కానుంది. ‘మోటో ఈ 7 పవర్ మొబైల్’ను శుక్రవారం విడుదలచేయనున్నట్లు మోటోరోలా వెల్లడించిన సంగతి..
Moto E7 Power Mobile: మోటోరోలా నుంచి మరో సరికొత్త ఫోన్ భారత్‌లో ఈ రోజు విడుదల కానుంది. ‘మోటో ఈ 7 పవర్ మొబైల్’ను శుక్రవారం విడుదలచేయనున్నట్లు మోటోరోలా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ Moto E7 Power Mobile ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి డిజిటల్ మార్కెట్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. 12 గంటల నుంచి సేల్ ప్రారంభంకానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ కూడా వెల్లడించింది. అయితే ఈ మొబైల్ అతి తక్కువ ధరకే లభిస్తుందని.. మార్కెట్లో పేర్కొంటుండంతో మొబైల్ ప్రియులు బుక్ చేసుకునేందుకు వేచిచూస్తున్నారు.
మోటో ఈ 7 పవర్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్.. స్క్రీన్: 6.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్ బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెమెరా: 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా ర్యామ్: 4GB స్టోరేజ్: 64GB ఆక్టా కోర్ ప్రాసెసర్, నీమో నెట్‌వర్క్ సపోర్ట్‌తో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఈ మొబైల్ వినియోగదారులకు లభించనుంది. అయితే మోటో ఈ 7 పవర్ స్పెసిఫికేషన్ల గురించి వెల్లడించిన సంస్థ.. ధర గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ మొబైల్ ధర రూ.8వేల వరకు ఉండవచ్చని పేర్కొంటున్నారు.
Also Read: