కుప్పంలో కోట్ల రూపాయల డబ్బులు పంచారు.. మూడో విడత పంచాయతీ ఫలితాలపై చంద్రబాబు ఆరోపణలు

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం..

కుప్పంలో కోట్ల రూపాయల డబ్బులు పంచారు.. మూడో విడత పంచాయతీ ఫలితాలపై చంద్రబాబు ఆరోపణలు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 18, 2021 | 4:54 PM

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అనూహ్యంగా టీడీపీ మద్దతుదారులు ఓటమి చెందారు. అక్కడ 89 పంచాయతీలకు గాను 79 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. దాంతో చంద్రబాబు సొంతనియోజకవర్గంలోనే టీడీపీ కుప్పకూలిపోయిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుప్పంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, వీటిపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. డబ్బు పంపిణీ సహా అనేక అక్రమాలపై ఆధారాలు అందించినా ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. కుప్పంలో తాము గెలవకపోవడం కాదని ప్రజాస్వామ్యమే ఓడిందని అన్నారు. కుప్పంతో తనకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉందని, అక్కడి ప్రజలు తనను ఓ కుటుంబ సభ్యుడిలా భావిస్తారని వెల్లడించారు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చూస్తే తొలి రెండు విడతల కంటే మూడో విడతలోనే అత్యధికంగా టీడీపీ మద్దతుదారులకు సర్పంచ్ స్థానాలు వచ్చాయని తెలిపారు. వాలంటీర్లు, అధికారులు సైతం బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసులకు పోలింగ్ బూత్ లోపల ఏం పని? అని ప్రశ్నించారు. శాంతికి పర్యాయపదంలా నిలిచే కుప్పంలో కోట్ల రూపాయలు డబ్బులు పంచారని ఆరోపించారు. శాంతియుత ప్రాంతాన్ని కలుషితం చేశారని విమర్శించారు.

Read more:

ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానిలు ఇవే..