అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్.. ముస్లింలకు శుభాకాంక్షలకు తెలిపిన ముఖ్యమంత్రి
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సాగనంపారు. దర్గాలో..
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ ను ముస్లిం మత పెద్దలు కేసీఆర్ ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమించాలని, కేసీఆర్ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థించారు. ఆజ్మీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ముస్లింలకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎంఎల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, టిఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్, ముఫ్తి సయ్యద్ యూసఫ్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Read more:
విశ్వనగరం హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం.. ఇండియా నుంచి భాగ్యనగరం ఎంపికపై మంత్రి కేటీఆర్ హర్షం