తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆ కేసులో 14 మందికి బెయిల్‌ మంజూరు.. పలు షరతులు విధించిన సికింద్రాబాద్‌ కోర్టు

తెలంగాణలో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో నిదింతులకు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరైంది. కేసులో..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆ కేసులో 14 మందికి బెయిల్‌ మంజూరు.. పలు షరతులు విధించిన సికింద్రాబాద్‌ కోర్టు
K Sammaiah

|

Feb 18, 2021 | 4:16 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో నిదింతులకు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరైంది. కేసులో అరెస్టైన 14 మందికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది సికింద్రాబాద్‌ కోర్టు. అయతే ప్రతి బుధవారం బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. అదేవిధంగా విచారణలో పోలీసులకు సహకరించాలని పేర్కొంది.

అయితే ఈ కేసులో ఏ1 నిందితురాలు అఖిలప్రియకు ఇప్పటికే బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. కాగా అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌, ఆమె సోదరుడు, మరో నిందితుడు గుంటూరు శ్రీను కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారు ఇప్పటికే ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు.

Read more:

విశ్వనగరం హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం.. ఇండియా నుంచి భాగ్యనగరం ఎంపికపై మంత్రి కేటీఆర్‌ హర్షం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu