అల్లూరిలో దారుణం: 4 కిలోమీటర్లు భుజాలపై మృతదేహం.. కలెక్టర్ సీరియస్!
అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి నుంచి గ్రామానికి మృతదేహం తరలింపునకు అంబులెన్స్ లేక.. మోసుకెళ్లారు బంధువులు. దాదాపు నాలుగు కిలోమీటర్లు మృతదేహాన్ని మోసారు. ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన అద్దన్న అనే గిరిజనుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన స్థానిక సీహెచ్సీకి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. అయితే మృతదేహాన్ని తిరిగి..

ముంచంగిపుట్టు, అక్టోబర్ 23: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి నుంచి గ్రామానికి మృతదేహం తరలింపునకు అంబులెన్స్ లేక.. మోసుకెళ్లారు బంధువులు. దాదాపు నాలుగు కిలోమీటర్లు మృతదేహాన్ని మోసారు. ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన అద్దన్న అనే గిరిజనుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన స్థానిక సీహెచ్సీకి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. అయితే మృతదేహాన్ని తిరిగి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సదుపాయం కల్పించాలని కోరారు మృతుడి బంధువులు. సిద్ధంగా లేకపోవడంతో ఆలస్యం అవుతుందని వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో మృతదేహాన్ని నాలుగు కిలోమీటర్లు భుజాలపై మోసుకొని గ్రామానికి తరలించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ ను ఆసుపత్రి సిబ్బంది నిరాకరించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి ఏం జరిగిందంటే..
వాస్తవానికి ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతదేహాలు తరలించేందుకు అంబులెన్స్ సదుపాయాలు లేవు. ప్రైవేట్ వాహనాల్లోనే గిరిజనులు ఆయా గ్రామాలకు తరలించకపోతుంటారు. అయితే ప్రైవేట్ వాహనాల కూడా మృతదేహం తరలించేందుకు అందుబాటులో లేకపోవడంతో.. అంబులెన్స్ కోసం ఆసుపత్రి సిబ్బందికి అడిగారు బంధువులు.
ఘటనపై కలెక్టర్ సీరియస్..
మృతదేహం మూసుకొని గ్రామానికి తరలింపు ఘటనపై అల్లూరి జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు కలెక్టర్ సుమిత్ కుమార్. అంబులెన్స్ రాక ఆలస్యం అవడంతో సగం దూరం వెళ్ళిన తర్వాత వాహనం అందుబాటులోకి వచ్చినా మృతదేహం అందులో తరలించేందుకు బాధిత బంధువులు నిరాకరించినట్టు ప్రాథమికంగా తెలుసుకున్నారు అధికారులు. దీనిపై పూర్తి విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆరా తీశారు. అయితే ముంచంగిపుట్టు పెదబయలు మండలాల గ్రామాల ప్రజలకు ఏకైక సిహెచ్సిగా ఉన్న ఆసుపత్రిలో మృతదేహాలు తరలించేందుకు ప్రత్యేకంగా మహాప్రస్థానం వాహనం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.