AP News: ఏం టాలెంట్ గురూ.! చేతి గోరుపై మెరిసిపోతోన్న వరల్డ్‌కప్.. వీడియో వైరల్..
క్రికెట్ అభిమానులకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌తో పెద్ద పండగే వచ్చిందని చెప్పాలి. భారత్ వేదికగా జరుగుతోన్న ఈ మెగా టోర్నమెంట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. రసవత్తరమైన మ్యాచ్‌లు ప్రేక్షకుల్లో బోలెడంత జోష్‌ను, ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫోబియా అలుముకుంది. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు గ్రౌండ్ లోపలే కాదు, గ్రౌండ్ బయట కూడా క్రికెట్ లవర్స్..
క్రికెట్ అభిమానులకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌తో పెద్ద పండగే వచ్చిందని చెప్పాలి. భారత్ వేదికగా జరుగుతోన్న ఈ మెగా టోర్నమెంట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. రసవత్తరమైన మ్యాచ్‌లు ప్రేక్షకుల్లో బోలెడంత జోష్‌ను, ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫోబియా అలుముకుంది. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు గ్రౌండ్ లోపలే కాదు, గ్రౌండ్ బయట కూడా క్రికెట్ లవర్స్.. తమకు ఆట పట్ల ఉన్న అభిమానాన్ని, ఇష్టాన్ని చాటుకుంటున్నారు. కమాన్ ఇండియా అంటూ భారత అభిమానులు భారత టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డుకు చెందిన కొత్తపల్లి రమేష్ ఆచారి అనే అంతర్జాతీయ సూక్ష్మ కళాకారుడు అతి చిన్నదైనా బంగారపు వరల్డ్‌కప్‌ను తయారు చేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. చేతి గోరుపై అమిరిపోయే సైజులో ఉండే ఈ బంగారపు అతి చిన్న వరల్డ్‌కప్ అందరినీ ఆకర్షిస్తుంది.
వరల్డ్‌కప్ నమూనాతో రూపొందించిన అతి చిన్న బంగారపు వరల్డ్‌కప్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని చేతి గోరు పైన కేవలం ఒక సెంటీమీటర్ ఎత్తుతో అర సెంటిమీటర్ వెడల్పుతో 0.350 మిల్లీగ్రాముల స్వచ్ఛమైన 916 కేడియం బంగారాన్ని ఉపయోగించి తయారు చేశాడు. దీని తయారీకి 8 గంటల సమయం పట్టినట్లుగా తెలియజేశారు రమేష్ ఆచారి.