AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి.. పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్రం సంతృప్తిని వ్యక్తం చేసిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాన్ని కేంద్రం స్వాగతించింది. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh: పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి.. పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి
Minister Nimmala Rama Naidu On Polavaram Progress
Gopikrishna Meka
| Edited By: Krishna S|

Updated on: Oct 06, 2025 | 9:21 PM

Share

పడకేసిన పోలవరం పనులను పట్టాలెక్కించి, పరుగులు తీయిస్తున్న చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల కేంద్రం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన పోలవరం పనుల సమీక్షా సమావేశం వివరాలను మంత్రి వివరించారు. 2019-24 మధ్య జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరానికి జరిగిన నష్టాన్ని, విధ్వంసాన్ని, 2024 లో కూటమి ప్రభుత్వ అధికారం లోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చక్కదిద్ది.. పనులను పరుగులు పెట్టిస్తున్న నేటి స్థితి వరకు సమీక్షలో చర్చించామన్నారు. లక్ష్యాన్ని నిర్ణయించుకుని 2027 డిసెంబర్ కల్లా.. వీలైతే పుష్కరాలకు ముందు అంటే అదే ఏడాది జూన్‌లోనే పోలవరం పూర్తి చేసి ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిల్ స్వాగతించారు. సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్దేశిత గడువులో పూర్తి చేయడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ హామీ ఇచ్చినట్లు రామానాయుడు స్పష్టం చేశారు. ఇందుకు ఆయనకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల పోలవరం పూర్తి కావడం, పోలవరం నీటితో రాష్ట్రం సస్యశ్యామలం కావడం ఖాయమన్నారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 లోనే పోలవరం పూర్తయ్యేదని మంత్రి రామానాయుడు చెప్పారు. 72శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల, రివర్స్ పాలనతో నీరుగార్చడం వల్ల ప్రాజెక్టుకు అపార నష్టం జరిగిందని మంత్రి ఆవేదన చెందారు. ప్రాజెక్ట్‌కు జరిగిన నష్టంతో పాటు ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్నదాతలకు రావలసిన 50 వేల కోట్ల ఆదాయం నష్టపోయినట్లు మంత్రి అంచనా వేశారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 23.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 28.5 లక్షలు మందికి తాగునీరు అందుతుందన్నారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. పోలవరంతో రాష్ట్రం దశ దిశ మారిపోవడం ఖాయమన్నారు. ఈ ఆశయంతోనే సీఎం చంద్రబాబు నాయుడు స్వయం పర్యవేక్షణలో ప్రతి 15 రోజులకు సమీక్ష చేస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ 1398 మీటర్లకు గాను ఇప్పటికి 686 మీటర్లు అంటే 56శాతం పూర్తయినట్లు చెప్పారు. ప్రస్తుత వర్షాకాలంలో రోజుకి 5 లక్షలు పైగా క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తున్నా పనులు ఆపలేదన్నారు. అదే జగన్ ఐదేళ్ల హయాంలో ఎగువ, దిగువ కాపర్ డ్యాముల మధ్య వరద నీరు రిజర్వాయర్‌ను తలపించేదన్నారు. ఇలా జరగకుండా బట్రస్ డ్యామ్ నిర్మించి సిపేజీని అరికట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టుకి నాటి జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని, దశల వారి జరిగిన విధ్వంసాన్ని మంత్రి కళ్ళకు కట్టినట్లు వివరించారు. వారి బాధ్యతా రాహిత్యాన్ని ఎండగట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2014-19 మధ్యకాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిన 3750 కోట్లు, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ గా వస్తే ఆ నిధులను దారి మళ్లించేసినట్లు రామానాయుడు వివరించారు.

ప్రాజెక్టుకి నిధుల సమస్య లేదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకి రూ.12157 కోట్లు కేంద్రం మంజూరు చేయగా ఇప్పటికే 5052 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. చేసిన పనులు తాలూకు వివరాలు ఎప్పటికప్పుడు కేంద్రానికి సమర్పిస్తే, దశల వారీగా నిధులు కేంద్రం మంజూరు చేస్తుందని.. అందువల్ల నిధుల సమస్య లేనే లేదని మంత్రి స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ -1కి సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నష్టపరిహారం, కాలనీల నిర్మాణం, వసతులు సమకూర్చడం వంటి అన్ని పనులు 2026 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. మొదటి ఫేజ్‌లో 20946 మంది నిర్వాసితులు ఉన్నట్లు చెప్పారు. వీరందరికీ 75 కాలనీలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికి 26 పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన 49 ప్రోగ్రెస్‌లో ఉన్నాయన్నారు. బ్యాలెన్స్ పనులకు, ఇతర సదుపాయాలు సమకూర్చడానికి రూ. 900 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచామన్నారు. ఫేజ్- 2 కి సంబంధించి నిర్వాసితులకు 2027 మార్చి కల్లా కాలనీలు నిర్మించి, సదుపాయాలు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రామానాయుడు చెప్పారు.

పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చేతులెత్తేసిన నాటి ముఖ్యమంత్రి జగన్‌కి, గడువు చెప్పి.. ప్రారంభానికి పనులు పరుగులు పెట్టిస్తున్న నేటి సీఎం చంద్రబాబు నాయుడు దక్షతకు తేడా గమనించాలని రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొదటి ఫేజ్‌లో 41.15 మీటర్లు కాంటూరు కి సంబంధించి 38వేల 060 కుటుంబాలను గుర్తించామన్నారు. ఇందులో మొదటి విడతలో 20,946, తరువాత రాడార్ సర్వే ద్వారా మరో 17,174 కుటుంబాలకు 75 కాలనీలు అవసరమైతే, నాడు చంద్రబాబు హయాంలోనే 26 కాలనీలు పూర్తి చేసినట్లు చెప్పారు. 49 కాలనీలో పురోగతిలో ఉన్నాయని వివరించారు. 2019-24 జగన్ పరిపాలనా కాలంలో ఒక్కకాలనీలో ఒక్క నిర్వాసితుడి ఇంటికి, అరబస్తా సిమెంట్ గానీ, మౌళిక వసతుల కోసం ఒక్క రూపాయి గానీ ఖర్చు పెట్టలేదని విమర్శించారు. నాడు చంద్రబాబు ప్రభుత్వంలో నిర్మించిన కాలనీలు తప్ప, ఒక్క నిర్వాసితుడి ఇంటిని కూడా పూర్తి చేయలేదని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం