Visakha Metro: కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ

Visakha Metro: కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ల‌క‌త్తా మెట్రో రైల్ త‌ర‌హాలో వంద‌శాతం కేంద్ర‌ప్ర‌భుత్వం భ‌రించేలా రైల్వే శాఖ‌కు అప్ప‌గించేలా కేంద్రం ముందు ప్ర‌తిపాద‌న ఉంచామ‌ని అన్నారు. రెండు ద‌శ‌ల్లో నాలుగు కారిడార్ల‌లో మెట్రో ఏర్పాటుకు..

Visakha Metro: కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
Follow us
Subhash Goud

|

Updated on: Nov 13, 2024 | 5:42 PM

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో విశాఖ ప్రజల్లో మళ్లీ ఆశలు చిగిరించాయి. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, అక్కడి నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పీజీవీఆర్‌ నాయుడు, వెలగలపూడి రామకృష్ణ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు విషయమై స్వయంగా కేంద్ర మంత్రిని కలిశామని, సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీ కి లేఖ రాశారని తెలిపారు. విశాఖలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపడతామని, రెండు ఫేజ్‌లలో 4 కారిడార్లలో నిర్మిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Business Familys: భారతదేశంలో టాప్-5 వ్యాపార కుటుంబాలు.. అంబానీ ఏ స్థానంలో ఉన్నారు?

ఇవి కూడా చదవండి

2024 విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌ ఐటం 12 ప్రకారం విజయవాడ, విశాఖకు మెట్రో రైలుపై ఫీజిబులిటి రిపోర్ట్‌ ఇవ్వాలని పొందుపర్చారు. దీని ప్రకారం 2014లో డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కునా అప్పటి టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. 2015లో డీఎంఆర్‌సీ ఏపీ సర్కార్‌కు నివేదిక అందించింది. విశాఖకు సంబంధించి 42.5 కిలోమీటర్ల నెట్‌ వర్క్‌తో మూడు కారిడార్లతో మీడియం మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విశాఖలో భోగాపురం వరకు పొడిగించాలనే ఉద్దేశంతో ఈ మెట్రో రైలు ప్రాజెక్టును పెండింగ్‌ పెట్టిందన్నారు. ఆ తర్వాత తిరిగి 2020 మార్చిలో గుర్గాంకు చెందిన వీఎంటీసీ అనే కంపెనీకి ఈ మెట్రో డీపీఆర్‌ బాధ్యతలు అప్పగించగా, మొత్తం 76.9 కిలోమీటర్ల మేర రూ.14,300 కోట్లతో నాలుగు కారిడార్ల‌లో ఏర్పాటుకు డీపీఆర్ ఇచ్చింద‌న్నారు. 2021 ఏప్రిల్‌లోనే డీపీఆర్ ఇచ్చిన‌ప్ప‌టికీ 2023 డిసెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కూ వైసీపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపాదనలు:

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ల‌క‌త్తా మెట్రో రైల్ త‌ర‌హాలో వంద‌శాతం కేంద్ర‌ప్ర‌భుత్వం భ‌రించేలా రైల్వే శాఖ‌కు అప్ప‌గించేలా కేంద్రం ముందు ప్ర‌తిపాద‌న ఉంచామ‌ని అన్నారు. రెండు ద‌శ‌ల్లో నాలుగు కారిడార్ల‌లో మెట్రో ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు ఇచ్చామ‌ని అన్నారు. మొద‌టి ద‌శ‌లో 46.23 కిమీ మేర మూడు కారిడార్ల‌లో నిర్మాణం చేపడతామన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!