Bank Holiday: నవంబర్‌ 15న బ్యాంకులు బంద్‌.. కారణం ఏంటో తెలుసా..?

Bank Holiday: సాధారణంగా ప్రతి నెల బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). పండగలు, ఇతర కార్యక్రమాలు, ప్రముఖుల జయంతిలకు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే ఈనెల 15న కూడా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మూసి ఉంటాయని తెలుస్తోంది..

Bank Holiday: నవంబర్‌ 15న బ్యాంకులు బంద్‌.. కారణం ఏంటో తెలుసా..?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 13, 2024 | 12:45 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవు జాబితా ప్రకారం, గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ సందర్భంగా శుక్రవారం అంటే నవంబర్ 15, 2024న కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఆర్బీఐ తన వెబ్‌సైట్‌లో రాష్ట్రాల వారీగా ప్రాంతీయ, జాతీయ సెలవులను ప్రచురిస్తుంది. నెలలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయని గుర్తుంచుకోండి.

గురునానక్ గురుపురబ్, గురునానక్ ప్రకాష్ ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. ఇది మొదటి సిక్కు గురువు గురునానక్ పుట్టిన జ్ఞాపకార్థం. గురునానక్, సిక్కుమతం స్థాపకుడు. అత్యంత గుర్తింపు పొందిన, ప్రముఖ సిక్కు గురువులలో ఒకరైన గురునానక్‌ను సిక్కు సమాజం గొప్పగా గౌరవిస్తుంది. ఈ వేడుక గురునానక్ బోధనల గురించి అవగాహనను పెంచుతుంది. అలాగే కార్తిక మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతిని అక్టోబర్ లేదా నవంబర్‌లో జరుపుకుంటారు. ఎందుకంటే చంద్ర క్యాలెండర్లు ప్రతి సంవత్సరం మారుతాయి.

15న ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌:

ఇవి కూడా చదవండి

మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్ – తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. బెంగాల్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్.

  • నవంబర్ 18 బ్యాంకులకు సెలవు:కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • నవంబర్ 23న సెంగ్ కుత్స్నేమ్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు బంద్‌.

ఇది కూడా చదవండి: MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హృదయాన్ని కదిలించిన అంధ యువకుని పాట.. కిరవాణి గారూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి