వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి..! ఏం చేశారంటే..

సుమారు 11 సెకన్ల ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఈ ఆలోచనను క్రియేటివ్‌ ఉందని చెబుతుంటే..చాలా మంది ఈ వీడియోపై మండిపడుతున్నారు. దీనిపై చాలా మంది ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

వీళ్ల పైత్యం పాడుగాను.. ఆడవాళ్లను అంగడి బొమ్మలుగా మార్చి..! ఏం చేశారంటే..
Live Mannequin
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 13, 2024 | 12:23 PM

ప్రస్తుత ప్రపంచమంతా బిజినెస్‌ యుగంగా మారింది. నేటి పోటీ మార్కెట్లో వ్యాపారం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ప్రతి వస్తువు అమ్మకానికి తప్పసరి ప్రమోషన్‌ అనేది అవసరంగా మారింది. కస్టమర్‌లను ఆకర్షించడం కోసం వ్యాపారస్తులు, దుకాణదారులు ఎన్నో ఉపాయాలు చేస్తుంటారు. కొందరు బైన్‌ వన్‌ గెట్‌ వన్‌ ఆఫర్లు పెడుతుంటారు. మరికొందరు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తారు. ఇంకొందరు కొన్న వస్తువుకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తుంటారు. బంపర్‌ లాటరీలు కూడా పెడుతుంటారు. ఇంకొందరు తమ షాప్‌ల ముందు ఫన్నీగా జోకర్‌, కార్టూన్‌ వంటి బొమ్మలను ఏర్పాటు చేసి వెల్కమ్‌ చెప్పిస్తుంటారు. అయితే, ఇదంతా ఓల్డ్‌ స్టైల్.. ఇప్పుడు ట్రెండ్‌ మారింది.. చైనీస్‌ రిటైల్‌ చైన్‌ ఒక కొత్త పద్ధతిని కనిపెట్టింది. చైనీస్ రిటైల్ చైన్ తన బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఎవరూ గెస్‌ చేయాలేని ప్లాన్‌ చేసింది. వీరి స్పెషల్‌ ప్రమోషన్ స్టైల్‌ ఇంటర్నెట్ పెను దుమారం రేపుతోంది. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..

సాధారణంగా పెద్ద షాపింగ్‌ మాల్స్‌ ముందు అందమైన బొమ్మలు ఏర్పాటు చేస్తారు. అవి వచ్చిపోయే కస్టమర్లకు స్వాగతం చెబుతూ, నవ్వుతూ చేతులు ఆడిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి. దాంతో కొనుగోలుదారులు ఆకర్షితులై ఆ షాపుకు వెళ్తుంటారు. అయితే, ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో దుకాణం ముందు బొమ్మలకు బదులుగా నిజమైన మహిళలు ట్రెడ్‌మిల్స్‌పై నడుస్తున్నారు. మోడల్‌ దుస్తులు ధరించి దుకాణం వెలుపల ఏర్పాటు చేసిన ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్న ఆడవాళ్లను చూసి ప్రజలు షాక్‌ అవుతున్నారు. ఈ షాప్‌ ఓనర్స్‌ తమ బిజినెస్‌ ప్రమోషన్ కోసం ఇలాంటి వినూత్న విధానం అవలంభించారు. ఇది ఇంటర్నెట్‌ను కదిలించింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

సుమారు 11 సెకన్ల ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఈ ఆలోచనను క్రియేటివ్‌ ఉందని చెబుతుంటే..చాలా మంది ఈ వీడియోపై మండిపడుతున్నారు. దీనిపై చాలా మంది ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..