NTPC Green Energy: త్వరలో ఐపీవోకు ప్రముఖ కంపెనీ.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే..!

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కానీ ఏ కంపెనీ స్టాక్ కొనుగోలు చేయాలో తెలియక సతమతమవుతుంటారు. దీనిలో భాగంగా వివిధ కంపెనీల స్టాక్ లు, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఇలాంటి వారందరికీ ఇది శుభవార్త. త్వరలో ఓ ప్రముఖ సంస్థ ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుంది. మంచి కంపెనీ షేర్లు కొనుగోలు చేయాలనుకునే వారందరికీ ఇది మంచి అవకాశం.

NTPC Green Energy: త్వరలో ఐపీవోకు ప్రముఖ కంపెనీ.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండగే..!
Follow us
Srinu

|

Updated on: Nov 13, 2024 | 2:25 PM

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెట్ అతి పెద్ద ఐపీవోను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కంపెనీ ఎప్పుడు ఐపీవోకు వస్తుంది, ఇతర వివరాలను తెలుసుకుందాం. ఎన్టీపీసీ క్లీన్ ఎనర్జీకి చెందిన అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెట్. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు గాను సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులపై ఇది పనిచేస్తుంది. కర్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధనానికి సంబంధించిన పునరుత్పాదక వస్తువుల వాటాను పెంచడానికి చర్యలు తీసుకుంటోంది.

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెట్ సంస్థ ఇప్పటికే దేశంలో అనేక భారీ సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించింది. ఇవి సూర్యరశ్మిని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. అలాగే దేశంలోని కోస్టల్, ఇన్ ల్యాండ్ విండ్ కారియర్ లను సద్వినియోగం చేసుకుంటూ పవన విద్యుత్ ప్రాజెక్టులను చేపడుతోంది. అలాగే సౌర, పవన శక్తిని మిళితం చేసే హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెట్ ఐపీవో వస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.వంద కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. వేలంలో రూ.10 వేల కోట్ల వరకూ సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 18వ తేదీన సబ్ స్క్రిప్షన్ కోసం ఐపీవో మొదలవుతుంది. పెట్టుబడి దారులకు నవంబర్ 21 వరకూ సమయం ఉంటుంది. అయితే స్టాక్ విలువ, ధర, తేదీలను పూర్తిస్థాయిలో ఖరారు కావాల్సి ఉంది.

ఎన్టీపీసీ గ్రీన్ తో పాటు ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ కూడా ఐపీవోకు రావడానికి సన్నాహాలు చేసుకుంటోంది. వేలంలో దాదాపు 344 మిలియన్ల డాలర్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. వివిధ కంపెనీలు తమ మూలధరం పెంచుకోవడం కోసం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వస్తాయి. తమ షేర్లను ప్రజలకు విక్రయిస్తాయి. తద్వారా సమకూరిన డబ్బును తమ పెట్టుబడికి ఉపయోగించుకుంటాయి. అయితే ఐపీవోకు రావడానికి సెబీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అలాగే సేకరించిన మూలధనాన్ని ఏ పనులకు వినియోగిస్తున్నారో కంపెనీ ముందుగానే స్పష్టం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి