Swiggy, zomato: స్విగ్గీ, జొమాటోల నుంచి మరిన్ని సేవలు.. కస్టమర్లకు మరింత ప్రయోజనం

ఆర్డర్ చేసిన వెంటనే ఇంటి వద్దకు ఆహారాన్ని తీసుకువచ్చి అందించే స్విగ్గీ, జొమాటో సంస్థల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఈ ఫుడ్ డెలివరి దిగ్గజాలు తమ సేవల ద్వారా అందరి అభిమానాన్ని పొందుతున్నాయి. పట్టణాల నుంచి మేజర్ పంచాయతీల వరకూ వీటి సేవలు విస్తరించాయి.

Swiggy, zomato: స్విగ్గీ, జొమాటోల నుంచి మరిన్ని సేవలు.. కస్టమర్లకు మరింత ప్రయోజనం
Swiggy, Zomato
Follow us
Srinu

|

Updated on: Nov 13, 2024 | 2:45 PM

వ్యాపారంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు తమ సేవలను మరింత విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాయి. స్విగ్గీ సంస్థ ఎల్లో అనే పేరుతో కొత్త సేవలను, రేర్ అనే ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక జొమాటో కూడా వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే సదుపాయం తీసుకురానుంది. స్విగ్గీ సంస్థ ఎల్లో పేరుతో కొత్త సేవలను ప్రారంభించనుంది. దీని ద్వారా ఆన్ లైన్ లో సేవా నిపుణులను అందుబాటులోకి తీసుకురానుంది. అంటే లాయర్లు, థెరపిస్టులు, ఫిట్ నెస్ ట్రైనర్లు, ఆస్ట్రాజలర్లు, డైటీషియన్లను ఒకే ప్లాట్ ఫాం మీదుకు తీసుకువచ్చి సేవలను అందించనుంది. అయితే ఎల్లో సేవలను స్విగ్గి యాప్ లోనే కొనసాగించాలా, వేరే యాప్ తో సేవలందించాలనే విషయంపై స్పష్టత రాలేదు. దానిపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. అలాగే ప్రీమియం కస్టమర్ల కోసం రేర్ పేరిట ఫార్ములా వన్ రేస్, మ్యూజిక్ కాన్సర్ట్, ఆర్ట్ ఎగ్జిబిషన్లకు ప్రవేశం కల్పించాలనుకుంటోంది.

జోమాటో సంస్థ కూడా ప్రజలకు కొత్త సేవలను అందించడానికి ప్రణాళిక రూపొందించింది. ఫుడ్ ఆర్డర్ విషయంలో చాట్ బాట్ ల స్థానంలో మనుషులను వినియోగించాలని భావిస్తోంది. అలాగే తన క్విక్ కామర్స్ వేదిక బ్లింకిట్ ద్వారా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్ సేవలను అందించేందుకు వేదికను సిద్దం చేస్తోంది. జోమాటో ఇటీవల ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎవరైనా వినియోగదారులు క్యాన్సిల్ చేసిన ఫుడ్ ఆర్డర్లను సమీపంలోని కస్టమర్లకు డిస్కౌంట్ పై అందజేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వాటికి కస్టమర్లు కొనుగోలు చేసుకోవచ్చు. జోమాటో సీఈవో దీపిందర్ గోయోల్ మాట్లాడుతూ ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ద్వారా తక్కువ ధరకు తొందరగా ఫుడ్ కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఫుడ్ వేస్టేజీని తగ్గించడానికే ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆయన వెల్లడించారు.

ఫుడ్ డెలివరీ యాప్ లైన స్విగ్గీ, జోమాటాలో మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ జరుగుతోంది. గత దశాబ్దంగా ఈ రెండు సంస్థలు తమ సేవలను విస్తరించుకుంటూ పోతున్నాయి. ముఖ్యంగా అడిగిన వెంటనే నచ్చిన ఆహారాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇవ్వడంతో ఈ రెండింటికీ ప్రత్యేక ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వారికి, కొత్త నగరానికి వచ్చిన వారికి, అర్జెంట్ పనులపై ఆహారం తయారు చేసుకోలేని వారికి ఎన్నో సేవలు అందిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!