Zelio Ebikes X-Men: నగర ప్రజలకు అనువైన ఈవీ స్కూటర్ ఇదే.. స్పీడ్ తక్కువై ఫీచర్లు ఎక్కువే

దేశంలో ఎలక్ట్రిక్ బైకులకు విపరీతమైన ఆదరణ ఏర్పడింది. దానికి అనుగుణంగానే వీటి విక్రయాలు జోరందుకున్నాయి. ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు వీటికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుబాటులో ధరలు, ఆకట్టుకునే స్లైల్, ప్రత్యేక ఫీచర్ల కారణంగా సామాన్యులు కూడా వీటికి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

Zelio Ebikes X-Men: నగర ప్రజలకు అనువైన ఈవీ స్కూటర్ ఇదే.. స్పీడ్ తక్కువై ఫీచర్లు ఎక్కువే
Zelio Ebikes X Men
Follow us
Srinu

|

Updated on: Nov 13, 2024 | 3:00 PM

దాదాపు అన్ని ద్విచక్ర వాహనాల కంపెనీలూ ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జెలియో ఈబైక్స్ కంపెనీ తన ఎక్స్ మెన్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. జెలియో ఈబైక్స్ తన ఎక్స్ మెన్ సిరిస్ లోని అప్ గ్రేటెడ్ వెర్షన్ ఎక్స్ మెన్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ ను నవంబర్ 12వ తేదీన విడుదల చేసింది. ముఖ్యంగా నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించింది. ఈ కొత్త స్కూటర్ స్పెషల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. రెండు రకాల బ్యాటరీ ఎంపికలు, నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. లెడ్ యాసిడ్ వేరియంట్ 60వీ 32 ఏహెచ్ రూ.71,500కు, 7వీ 32ఏహెచ్ రూ.74 వేలు పలుకుతోంది. అలాగే లిథియం – అయాన్ వేరియంట్ లో 60వీ 30 ఏహెచ్ ధరను రూ.87,500, 74వీ32ఏహెచ్ ధరను రూ.91,500గా నిర్ణయించారు.

ఎక్స్ మెన్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు వంది కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. 60/72వీ బీఎల్డీసీ మోటార్లను దీనిలో అమర్చారు. ఒక్కసారి చార్జింగ్ చేయడానికి 1.5 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఈ స్కూటర్ బరువు 90 కిలోలు, అలాగే 180 కేజీల వరకూ బరువును మోస్తుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీని చార్జింగ్ చేయడానికి 8 నుంచి 10 గంటలు, లిథియం – అయాన్ వేరియంట్ చార్జింగ్ కు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. బ్యాటరీకి ఏడాది లేదా పది వేల కిలోమీటర్ల వరకూ వారంటీని ఇస్తున్నారు. అలాగే గ్రీన్, వైట్, సిల్వర్, రెడ్ కలర్లలో ఈ స్కూటర్ విడులైంది.

ఎక్స్ మెన్ 2.0 లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఫ్రంట్ మరియు రియర్ డిస్క్ బ్రేకులు, ముందు అల్లాయ్ వీల్స్, వెనుక హబ్ మోటారు ఏర్పాటు చేశారు. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్, వెనుక స్ప్రింగ్- లోడెడ్ షాక్ అబ్జర్వర్లు అమర్చారు. ఇక యాంటి థెఫ్ట్ అలారం, సెంట్రల్ లాకింగ్, రివర్స్ గేర్, పార్కింగ్ స్పీచ్, యూఎస్ బీ చార్జర్, డిజిటల్ డిస్ ప్లే తదితర అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్ మెన్ 2.0 స్కూటర్ గరిష్ట వేగంతో తక్కువగా ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పట్టణాల్లోని ట్రాఫిక్ లో సులభంగా ప్రయాణం చేయవచ్చు. ధర తక్కువగా ఉండడంతో పాటు అనేక ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. తక్కువ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మంచి గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి