MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హృదయాన్ని కదిలించిన అంధ యువకుని పాట.. కిరవాణి గారూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి!

MD Sajjanar: యువకుడి టాలెంట్‌ను చూసి బస్సులో ఉన్న ప్రయాణికులంతా మెచ్చుకున్నారు. కాగా అంధ యువకుడు పాడిన ఈ పాటను ఆ బస్సులో ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ వీడియో కాస్త వైర్‌ల్‌ అయ్యింది. ఈ వీడియోను చూసిన

MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హృదయాన్ని కదిలించిన అంధ యువకుని పాట.. కిరవాణి గారూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 12, 2024 | 6:37 PM

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. అది అప్పుడప్పుడు బయటపడుతుంటుంది. అందుకే టాలెంట్ ఎవరి సొత్తు కాదని అంటుంటారు. కొందరి టాలెంట్‌ను చూస్తే ఆశ్చర్యపోయేలా ఉంటుంది. టాలెంట్‌కు అంగవైకల్యం అడ్డుకాదని ఈ యువకుడు నిరూపిస్తున్నాడు. కొందరికి టాలెంట్‌ ఉన్నప్పటికీ అది బయటపడకుండా లోలోపలే దాచుకుంటున్నారు. అద్భుతమైన టాలెంట్‌ ఉన్నవారు సోషల్‌ మీడియా వేదికగా ఫ్రూ చేసుకుంటారు. సోషల్‌ మీడియా అనేది అలాంటి వారికి మంచి వేదిగా మారుతోంది. ఈ సోషల్‌ మీడియా వేదికగా ఎందరో తమ టాలెంట్‌ను బయటపెట్టుకుంటున్నారు. అంగవైకల్యం ఉన్న వారు కూడా తమ టాలెంట్‌తో అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతమైన పాటలో అందరికి ఆకట్టుకున్నాడు.

అంధుడైనప్పటికీ పాటతో అందరిని కట్టిపడేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అయ్యింది. అయితే ఈ అంధ యువకుడు పాడిన పాట తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కంట పడింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. ఆ యువకుడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిని కోరారు. వివరాల్లోకి వెళితే.. ఓ అంధ యువకుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. అతనికి చూపు లేదు. కానీ అతనికి అద్భుతమైన గొంతు ఉంది. ఆ గొంతులో అధ్బుతమైన మాధూర్యం ఉంది. కళ్లు లేని ఆ యువకుడు శ్రీ ఆంజనేయం సినిమాలోని రామ రామ రఘురామ పాట పాడుతూ అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అతని పాటను విన్న ప్రయాణికులు సైతం చప్పట్లతో అతన్ని అభినందించారు.

యువకుడి టాలెంట్‌ను చూసి బస్సులో ఉన్న ప్రయాణికులంతా మెచ్చుకున్నారు. కాగా అంధ యువకుడు పాడిన ఈ పాటను ఆ బస్సులో ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ వీడియో కాస్త వైర్‌ల్‌ అయ్యింది. ఈ వీడియోను చూసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ అంధుడు పాడిన పాట సజ్జనార్‌ హృదయాన్ని కదిలించింది.

ఈ యువకుడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు సజ్జనార్‌. మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్’ అని ట్వీట్‌ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

AP కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్..PMT, PET పరీక్షకు గడువు పెంపు
AP కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్..PMT, PET పరీక్షకు గడువు పెంపు
జాఫర్ vs మైకెల్ వాన్: మరోసారి ట్వీట్లు చేసుకున్న మాజీలు..
జాఫర్ vs మైకెల్ వాన్: మరోసారి ట్వీట్లు చేసుకున్న మాజీలు..
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వక్ర బుధుడి ప్రభావం.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
వక్ర బుధుడి ప్రభావం.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
ఈ చిన్నది ఇలా మారిపోయిందేంటీ సుధ..!
ఈ చిన్నది ఇలా మారిపోయిందేంటీ సుధ..!
మూడేళ్లల్లో ముచ్చటైన రాబడి.. ఆ రెండు బ్యాంకుల ఎఫ్‌డీలతోనే సాధ్యం
మూడేళ్లల్లో ముచ్చటైన రాబడి.. ఆ రెండు బ్యాంకుల ఎఫ్‌డీలతోనే సాధ్యం
ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ హరిని ఇలా పూజించండి.. స్వామి దయ మీ సొంత
ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ హరిని ఇలా పూజించండి.. స్వామి దయ మీ సొంత
చిరంజీవి, రామ్ చరణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నయనతార
చిరంజీవి, రామ్ చరణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నయనతార
లాభాల బాటలో యాపిల్ ఇండియా.. నికర లాభం ఎన్ని కోట్లంటే..?
లాభాల బాటలో యాపిల్ ఇండియా.. నికర లాభం ఎన్ని కోట్లంటే..?
జియోకు భారీ షాక్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు..ట్రాయ్‌ నివేదిక
జియోకు భారీ షాక్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు..ట్రాయ్‌ నివేదిక