IIIT-Basara: కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర IIIT విద్యార్ధిని స్వాతి ప్రియ సూసైడ్ నోట్.. అందులో ఏం ఉందంటే!

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు ఆగటం లేదు. తాజాగా మరో విద్యార్ధిని సూసైడ్ చేసుకుంది. విద్యార్ధిని రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను సీనియర్లు వేధిస్తున్నారని కాలేజ్ అధికారులకు ఫిర్యాదు చేశానని, కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై తనువు చాలించినట్లు నోట్ లో పేర్కొంది..

IIIT-Basara: కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర IIIT విద్యార్ధిని స్వాతి ప్రియ సూసైడ్ నోట్.. అందులో ఏం ఉందంటే!
IIIT Basara student
Follow us
Naresh Gollana

| Edited By: Srilakshmi C

Updated on: Nov 12, 2024 | 7:47 PM

బాసర, నవంబర్‌ 12: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్య అనేక అనుమానాలకు తెర లేపింది. సీనియర్ విద్యార్థి వేదింపుల కారణంగా యూనివర్సిటీ అధికారులకు గత నెల ఫిర్యాదు చేసిన స్వాతి ప్రియ తీవ్ర మనోవేదనకు గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫిర్యాదు కాఫీలో సీనియర్లపై ఆరోపణ చేసిన స్వాతి ప్రియ తన మరణ లేఖలో మాత్రం తన చావుకు ఎవ్వరు కారణం కాదంటూ‌.. ఎవ్వరిని ఇబ్బంది పెట్టవద్దంటూ పేర్కొంది. అమ్మానాన్న క్షమించండి.. స్నేహితులకు తుది వీడ్కోలంటూ కన్నీళ్లతో చివరిని లేఖను రాసుకొచ్చింది స్వాతి ప్రియ.

స్వాతి ప్రియ సూసైడ్ నోట్ సారాంశం లోకి వెళితే…

‘సారీ మమ్మీ .. సారీ డాడీ.. నేను ఇలా చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు మనసు ఒప్పట్లే మమ్మీ నాకు ఎప్పుడు చూసినా చచ్చిపోవాలి అని అనిపిస్తుంది. ఎందుకో చాలా భారంగా ఉంది మమ్మీ. మీ కూతురుగా కాదు మీకు కొడుకులా ఉందాం అనుకున్నా స్ట్రాంగ్‌గా.. కానీ చిన్నపిల్లల ఏడుస్తున్న. నా చావుకి ఎవరూ కారణం కాదు.. కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు కాదు. నా లాస్ట్ కోరిక మన వినోద్ అన్నని పెద్దనాన్న వాళ్లు అనాధ ఆశ్రమంలో వదిలేశారు. ఆ అన్న రోడ్లమీద బిక్షం అడుక్కుంటున్నాడంట. అన్నకి మంచిగా ఫుడ్ పెట్టి, బాగా చూసుకోండి. నేను లేని లోటు అన్న తీరుస్తాడు. ఇంకొకటి నా ఫ్రెండ్స్, మా అన్నలు అందరూ నన్ను చూడడానికి రావాలి. మీరు ఎవరెవరితో గొడవపడ్డారు మన రిలేటివ్స్ లో వాళ్లు అందరూ రావాలి. మమ్మీ నన్ను తాత పక్కన పూడ్చిపెట్టండి. తాతతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తప్పు చేస్తున్నా అని అనిపిస్తుంది. కానీ నావల్ల అవ్వట్లేదు. మమ్మీ మరి రిలేటివ్స్ లో చాలామందితో మాట్లాడరు కదా. అందరితో మాట్లాడు మమ్మీ. అక్క, తమ్ముడు వాళ్ళను బాగా చూసుకో. అక్క తమ్ముడిని వాళ్ళకి నచ్చిన స్టడీ, జాబ్ చేయించు మమ్మీ. అక్కకి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయండి. తమ్ముడికి హాస్టల్లో ఉండాలని లేదు. బయటనే జాయిన్ చేయండి. డాడీ నువ్వు స్మోకింగ్ మానేయాలి. అలాంటి తప్పులు చేయకండి. మంచిగా ఉండండి. మమ్మీ మా టెన్త్ ఫ్రెండ్స్ కి ఆన్లైన్ ఫ్రెండ్స్ కి బాసరలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ రావాలి. నాకు క్లోజ్ గా ఉన్నవాళ్లు వచ్చి నన్ను లాస్ట్ టైం హగ్ చేసుకోవాలి’.

‘నేను చచ్చిపోయాక మమ్మీ నావల్ల మీరు చాలా బాధపడతారు. నాకు తెలుసు. బట్ నేను ఏం చేయలేకపోతున్నాను. నేను దూరం అయ్యాక మా ఫ్రెండ్స్ కి నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ, అక్క వాళ్ళకి మెసేజ్ పెట్టు. స్వాతి ఈజ్ నో మోర్.. షి ఇస్ డెడ్ అని మెసేజ్‌ పెట్టు. మంచిగా చదువుకో అక్క. నేను జయసు అన్నకు రూ.800 ఇవ్వాలి. నా ఫోన్ పేలో ఉన్నాయి. నువ్వు ఇవ్వు అక్క సరేనా. నా ఫోన్లో అన్నయ్య అని నెంబర్ సేవ్ చేసి ఉంటుంది. సారీ అక్క.. చెల్లిలా నీతో ఉండాలని అనుకున్న. కానీ నేను సిక్స్త్, టెన్త్‌ ఉన్నప్పటి నుంచి నువ్వు నాకు దూరంగానే ఉన్నావ్. ఐ మిస్ యు సో మచ్.. ఐ లవ్ యు.. మమ్మీ డాడీ అక్క తమ్ముడు. తమ్ముడికి ఎలాంటి బ్యాడ్ హాబీస్ అలవాటు పడొద్దు.. ఓకేనా. అక్క నీకు ఏ ప్రాబ్లం ఉన్నా డాడీకి చెప్పు.. అర్థం చేసుకుంటారు. తిడతారని అనుకోకు. నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ఎవరూ వచ్చినా నన్ను ఒకసారి హగ్ చేసుకోండి. బతికున్నప్పుడు ఎలాగో నన్ను హగ్ చేసుకో లేదు. కనీసం ఇప్పుడైనా హగ్ చేసుకోండి. డాడీ నువ్వు మాల వేసుకున్నావ్. అయినా ఇలా చేస్తున్న తప్పట్లేదు. సారీ.. సారీ.. ఐ లవ్ యు. ఎవ్రీ వన్ తెలిసి తెలియక ఎప్పుడైనా ఎవరిని అయినా హర్ట్ చేసి ఉంటే హండ్రెడ్ ఐ యాం సో సారీ అండ్ ఐ లవ్ యు ఆల్’.

‘మమ్మీ డాడీ.. నా బాడీలో ఏ పార్టైనా డొనేట్ చేయగలిగితే చేయు. ఈ పనికిరాని బాడీని దానికి అయినా యూస్ చేయండి. అండ్ ఏం లేదులే.. బాయ్ మమ్మీ, బాయ్ డా. సారీ ఇది నైట్ రాసిన మా. ఇప్పుడు ఇది మార్నింగ్ లేచి రాస్తున్న.. చనిపోవడం అండ్ డిసైడ్ అయిపోయిన ఇంకా వద్దు నాకు ఈ లైఫ్ అక్క.. నేను పోతే పిల్లలకు నా పేరు పెట్టాల్సిన అవసరం లేదు కానీ అక్కకి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయండి. అక్క నువ్వు, లక్కీ జేఈఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఇద్దరికీ లవ్ యు బోత్ ఆఫ్ యు. మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అమృత సారీ.. ఇంక వెళ్ళిపోతున్న నేను. నితిన్ నాతో ఈ మంత్ బాగా మాట్లాడినావు. వన్ మంత్ అవుతుంది అండ్ నిన్ను లైవ్లో చూసి కరెక్ట్ గా మంత్ అవుతుంది. బాయ్ నీకు కూడా.. మీ అందరికీ సారీ. అండ్ మమ్మీ, డాడీ, అక్క, బాబి సారీ మీకు అందరికీ. మళ్లీ అక్క కడుపులోని పుట్టాలని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్న.. నా చావుకు నేను మాత్రమే కారణం. ఎవరు కారణం కాదు.. నా ఫోన్ మా అక్క తప్ప ఎవరూ చూడాల్సిన అవసరం లేదు. కాల్స్ వచ్చిన మెసేజ్ వచ్చిన అక్క రెస్పాండ్ అవుతుంది. నాకోసం ఏడ్చిన వాళ్ళు ఉన్నారు.. నా మీద కోపంతో కూడా ఉన్నారు. వాళ్లందరికీ లవ్ యు అండ్ బాయ్. అందరికీ సైనింగ్ ఆఫ్ ఫరెవర్ … ఏదో రాయాలి అని ఉంది.. బట్ ఏం రాయాలో అర్థం కావట్లే. బట్ ఐ ఫీల్ సో.. ఇంకేం లేదు. ఇంకా నా లైఫ్ లో అన్నట్టు బట్ ఓకే ఇట్స్ ఫైన్ బాయ్ గైస్ లవ్ యు ఆల్..’ అంటూ తన సూసైడ్ నోట్ ను ముగించింది స్వాతి ప్రియ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.