Telangana: ఇంటి వరండాలో వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్.!
ఆ ఇంట్లోని అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఉదయాన్నే కావడంతో ఇల్లంతా హడావుడిగా ఉంది. ఈలోగా వరండా నుంచి వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఏంటా అని వెళ్లి చూడగా..
అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండచిలువ ఒక్కసారిగా ఇంట్లో ప్రత్యక్షం కావడంతో భయంతో వణికిపోయారు. ఇంట్లో శబ్దం రావడంతో ఏదో వస్తువు అనుకున్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే భారీ కొండ చిలువ. ఇంకేముంది ఇంట్లో నుంచి పరుగో పరుగు.. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బైపాస్ వద్ద ఉన్న గంట కుశయ్య గౌడ్ ఇంట్లో చోటు చేసుకుంది. ఆ ఇంట్లో ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. ఉదయం పూట ఇంట్లో ఎవరి పనులు వారు చేస్తుండగా ఒక మూలన వింత శబ్దాలు రావడంతో.. అటువైపు వెళ్లిన కుశయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మూలకు కొండచిలువ కనబడటంతో చుట్టుపక్కల వారు భయాందోళనలు గురైయ్యారు.
ఇంట్లోకి కొండ చిలువ రావడంతో కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. అంతే కాకుండా ఇంట్లోకి వెళ్లాలంటే భయపడ్డారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో పెద్దఎత్తున కుశయ్య ఇంటికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు స్నెక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో 2 గంటల తర్వాత చేరుకున్న స్నెక్ క్యాచర్ మూలన నక్కి ఉన్న కొండ చిలువను ఒక పొడవాటి కట్టెతో బయటకు తీస్తున్న క్రమంలో పరుగులు పెట్టింది. స్నేక్ క్యాచర్ చాకచక్యంగా వ్యవహరించి బంధించాడు. అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
ఇది చదవండి:
చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!

