AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MTNL: మరింత కష్టాల్లో ఎంటీఎన్‌ఎల్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం కానుందా?

MTNL: ఇందులో అసలు మొత్తం రూ.999.54 కోట్లు మాత్రమే బకాయి ఉంది. ఇది కాకుండా, ఎంటీఎన్‌ఎల్‌ పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, UCO బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లకు చేసిన చెల్లింపులలో కూడా డిఫాల్ట్ చేసింది..

MTNL: మరింత కష్టాల్లో ఎంటీఎన్‌ఎల్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం కానుందా?
Subhash Goud
|

Updated on: Nov 13, 2024 | 10:08 AM

Share

ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో టెలికాం సేవలను అందించే ప్రభుత్వ సంస్థ MTNL (మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్) ఇప్పుడు కష్టాల్లో మునిగిపోతుంది. భారీ నష్టాల్లో ఉన్న కంపెనీ ఇప్పుడు రుణ వాయిదా కూడా చెల్లించడంలో విఫలమయినట్లు తెలుస్తోంది. ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ ఎంటీఎన్‌ఎల్ కష్టాలు తీరడం లేదు. తాజా కేసు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినది. ఈ ప్రభుత్వ సంస్థ బ్యాంకుకు వెయ్యి కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేకపోయింది. దీని కారణంగా, FY 2025 రెండవ త్రైమాసికానికి బ్యాంక్ తన ఆర్థిక నివేదికలలో రూ. 200 కోట్లను కేటాయించవలసి వచ్చింది.

MTNL మొత్తం రూ.5,726.29 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైంది. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం రూ.5,492 కోట్లు, వడ్డీ రూ.234.28 కోట్లు ఉన్నాయని కంపెనీ చెబుతోంది.

32 వేల కోట్లకు పైగా రుణభారం:

MTNL మొత్తం ఆర్థిక రుణం ఇప్పుడు రూ. 32,097.28 కోట్లకు పెరిగిందని సమాచారం. వార్షిక ఆదాయం రూ.798 కోట్ల కంటే ఇది 40 రెట్లు ఎక్కువ. అంటే కంపెనీ తన ఆదాయం నుంచి కూడా ఈ రుణాన్ని చెల్లించలేకపోతోంది. MTNLకి అతిపెద్ద రుణ ప్రదాత ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’. MTNL డేటా ప్రకారం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 3,480.85 కోట్ల రుణం చెల్లింపులో కంపెనీ డిఫాల్ట్ అయింది. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం రూ.1,039.77 కోట్ల రుణం బకాయి ఉంది.

ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్‌ టాటా 10,000 కోట్ల ఆస్తిలో వంట మనిషితో పాటు కుక్కకు కూడా వాటా..!

ఇందులో అసలు మొత్తం రూ.999.54 కోట్లు మాత్రమే బకాయి ఉంది. ఇది కాకుండా, ఎంటీఎన్‌ఎల్‌ పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, UCO బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లకు చేసిన చెల్లింపులలో కూడా డిఫాల్ట్ చేసింది. ఇంతలో కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, MTNL రుణానికి సంబంధించి ఎటువంటి అభద్రతాభావం లేదని, ఎందుకంటే ఇది ప్రభుత్వ సంస్థ. అందువల్ల అయితే త్వరలో MTNL వ్యాపారం దేశవ్యాప్తంగా తన సేవలను అందించే ప్రభుత్వ సంస్థ BSNLకి మార్చనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హృదయాన్ని కదిలించిన అంధ యువకుని పాట.. కిరవాణి గారూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us