Varun Tej: తిరుమల శ్రీవారి సేవలో వరుణ్ తేజ్ మట్కా టీమ్‌’.. సినిమా రిలీజ్‌కు ముందు స్వామివారి దర్శనం.. వీడియో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా. పలాస సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం (నవంబర్ 14న) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Varun Tej: తిరుమల శ్రీవారి సేవలో వరుణ్ తేజ్ మట్కా టీమ్‌’.. సినిమా రిలీజ్‌కు ముందు స్వామివారి దర్శనం.. వీడియో
Varun Tej
Follow us
Basha Shek

|

Updated on: Nov 13, 2024 | 6:07 PM

గని, గాంఢీవ ధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో ఢీలా పడిపోయాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అందుకే ఇప్పుడు మట్కా అంటూ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వస్తున్నాడీ మెగా హీరో. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సినిమా గురువారం ( నవంబర్ 14)న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే విశాఖ పట్నంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. తాజాగా హీరో వరుణ్ తేజ్ తో పాటు మట్కా టీమ్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందు టీమ్ అంతా కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మట్కా మూవీ సూపర్ హిట్‌ కావాలని ప్రత్యేక పూజులు చేశారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు వీరికి సాదర స్వాగతం పలికారు. అనంతరం దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా మట్కా మూవీ ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో బుధవారం (నవంబర్ 13) మరో ఈవెంట్ జరగనుంది. ఎన్‌విఆర్ సినిమాస్‌లో జరిగే ఈవెంట్‌కు వరుణ్ తేజ్ తో పాటు చిత్ర బృందమంతా హాజరుకానున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. మట్కా జూదాన్ని ముంబైలో ప్రారంభించిన రతన్ ఖాత్రి జీవితం ఆధారంగా మట్కా సినిమాను తెరకెక్కించారు. బర్మా నుంచి శరణార్థిగా వచ్చిన వాసు.. వైజాగ్ ను ఎలా ఏలాడన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో సలోని, సత్యం రాజేష్, రవి శంకర్, కిషోర్, నవీన్ చంద్ర, అజయ్‌ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

తిరుమల శ్రీవారి సేవలో వరుణ్ తేజ్.. వీడియో

రేపే సినిమా రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
'జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి'
'జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి'
ఆదివారం మాంసం తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే
ఆదివారం మాంసం తింటున్నారా..? ఈ విషయం తెలిస్తే