Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా

కొంతమంది హీరోయిన్ చేసినవి తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతో హిట్స్ అందుకొని స్టార్స్ గా మారిపోతున్నారు. మరికొంతమంది మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటున్నా హిట్స్ మాత్రం కొట్టలేకపోతున్నారు.

Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా
Tollywoo Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2024 | 6:13 PM

హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. అవకాశాలు ఉన్నా సక్సెస్ కూడా ఉండాలి. కొంతమంది హీరోయిన్ చేసినవి తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతో హిట్స్ అందుకొని స్టార్స్ గా మారిపోతున్నారు. మరికొంతమంది మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటున్నా హిట్స్ మాత్రం కొట్టలేకపోతున్నారు. అలాంటి వారు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. హిట్స్ ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కానీ హిట్స్ మాత్రం అందుకోవడం లేదు. దాంతో ఇప్పుడు ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి. నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోయిన్స్ హిట్స్ కొడుతూ పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంటే ఈ భామ మాత్రం ఇంకా సాలిడ్ హిట్ రుచి చూడాలని ఎదురుచూస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

తెలుగులో ఈ చిన్నది వెబ్ సిరీస్ లు, సినిమాలు కలిపి  చేసింది 12. కానీ హిట్ అయినవి మాత్రం కేవలం రెండు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..? తొలి సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది పాయల్. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ వయ్యారి. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.

ఇది కూడా చదవండి : S. S. Rajamouli: రాజమౌళికి బాగా నచ్చిన నటి.. సావిత్రి, అనుష్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

ఆతర్వాత ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఆర్ఎక్స్ 100తర్వాత వరుసగా ఎన్టీఆర్: కథానాయకుడు, RDX లవ్,వెంకీ మామా, డిస్కో రాజా, అన‌గ‌న‌గా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, జిన్నా, మాయాపేటిక, మంగళవారం, రక్షణ సినిమాలు చేసింది. వీటిలో ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయిన సినిమా మంగళవారం. ఈ సినిమాకు కూడా అజయ్ భూపతినే దర్శకత్వం వహించాడు. తెలుగు సినిమాలతో పాటు హిందీ పంజాబీ లోనూ సినిమాలు చేసింది. అలాగే ఓ కన్నడ సినిమా కూడా చేసింది పాయల్. కానీ అక్కడ కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. ఈ అమ్మడి క్రేజీ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!