- Telugu News Photo Gallery Cinema photos This is actor Suriya favourite heroine other than his wife Jyothika
Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు
హీరో సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ లో విడుదలైన సూర్య ప్రతి సినిమా తెలుగులోను డబ్ అవుతుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ సూర్య సినిమాలు దూసుకుపోతున్నాయి.
Updated on: Nov 11, 2024 | 2:02 PM

స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక హీరో సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ లో విడుదలైన సూర్య ప్రతి సినిమా తెలుగులోను డబ్ అవుతుంది. అలాగే కలెక్షన్స్ పరంగానూ సూర్య సినిమాలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం కంగువ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు సూర్య.

తాజాగా సూర్య నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షోలో సూర్య బాలకృష్ణతో కలిసి తెగ సందడి చేశారు. ఎన్నో విషయాలను పంచుకున్నారు సూర్య. అలాగే తన అభిమాన నటి ఎవరో కూడా ఈ షోలో రివీల్ అయ్యింది.

ముందుగా సూర్యను ఈ ప్రశ్న అడగ్గా ఆయన తప్పిచుకున్నారు. సూర్య తమ్ముడు కార్తీకి బాలయ్య ఈ షో నుంచి ఫోన్ చేశారు. జ్యోతికా కాకుండా సూర్యకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని కార్తీని అడిగారు. దానికి కార్తీ ఆసక్తికర సమాధానం చెప్పాడు.

సూర్య ఫస్ట్ క్రష్ ఓ హీరోయిన్ అని చెప్పాడు. ఆ హీరోయిన్ అంటే మా అన్నయ్యకు చాలా ఇష్టం అని కార్తీ చెప్పాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ గౌతమి. ఈ ఒకప్పటి స్టార్ హీరోయిన్ సూర్య ఫస్ట్ క్రష్ అని కార్తీ రివీల్ చేశాడు.




