S. S. Rajamouli: రాజమౌళికి బాగా నచ్చిన నటి.. సావిత్రి, అనుష్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా నిలబడేలా చేశారు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు.

S. S. Rajamouli: రాజమౌళికి బాగా నచ్చిన నటి.. సావిత్రి, అనుష్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే..
Rajamouli
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 11, 2024 | 10:21 AM

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా ముందుగానే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అవుతారు ప్రేక్షకులు. రాజమౌళి ఏ సినిమా చేసిన అది సంచలన విజయం సాధించడం పక్కా.. ఇప్పటివరకు అపజయం అంటూ ఎరగకుండా దూసుకుపోతున్నారు. ఇక చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా నిలబడేలా చేశారు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ తో జక్కన్న ఎలాంటి సినిమా చేస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవ్వనుంది.

ఇది కూడా చదవండి : Life of Pi : లైఫ్ ఆఫ్ పై సినిమాలో చేసిన ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు ఆమెను చూస్తే దిమ్మ తిరగాల్సిందే

ఇదిలా ఉంటే రాజమౌళి తన కథలతోనే కాదు నటీనటుల ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు వహిస్తారు. పాత్రకు ప్రాణంపోసే నటులను ఎంచుకుంటూ ఉంటారు. అయితే రాజమౌళికి బాగా నటించిన నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజమౌళి ఎంతో మంది అగ్రతారలతో పని చేశారు. సీనియర్ హీరోయిన్స్ దగ్గర నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు అందరితో కలిసి పని చేశారు. అయితే ఆయనకు మాత్రం ఓ యంగ్ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పారు.

ఇది కూడా చదవండి :Jr.NTR : ఈ ఎన్టీఆర్ హీరోయిన్ను గుర్తుపట్టారా.? అస్సలు ఊహించలేరు గురూ..

గతంలో రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సహజంగా తనకు సావిత్రి, సూర్యకాంతం అంటే ఎంతో ఇష్టం అని అన్నారు. ఆ ఇద్దరి తర్వాత తనను అంతగా మెప్పించిన నటి అనీ  అని అన్నారు. నాగార్జున హీరోగా నటించిన రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనీ. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించగా.. సినిమాలో యాక్షన్ సీన్స్ కు రాజమౌళి దర్శకత్వం వహించారు. కాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..  చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నారి అనీ నటనకి తాను ఫిదా అయినట్లు తెలిపారు. అలాగే సినిమాలోని ఓ పెద్ద సీన్ ఉంది. అందులో కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరివల్లా కాదు. కానీ అమ్మాయి కళ్ళతోనే ఎమోషనల్స్ పలికించింది అని రాజమౌళి తెలిపారు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయిన అనీ.. ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. రాజన్న సినిమా టైం లో ఆమె వయసు కేవలం 10 ఏళ్లు మాత్రమే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!