AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశం విడిచి పారిపోయిన నటి.. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అంటూ..

తాను దుబాయ్‌లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నానని తెలిపింది. ఆమె స్వయంగా మీడియాతో మాట్లాడుతూ.. దుబాయ్‌లో బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అని తెలిపింది.

దేశం విడిచి పారిపోయిన నటి.. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అంటూ..
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2024 | 9:31 AM

Share

కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ రాఖీ సావంత్. ఈ బాలీవుడ్ అందాల భామ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంది. తాజాగా దుబాయ్‌లో మీడియా కంట పడింది రాఖీ. దాంతో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తాను దుబాయ్‌లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నానని తెలిపింది. ఆమె స్వయంగా మీడియాతో మాట్లాడుతూ.. దుబాయ్‌లో బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అని తెలిపింది. మైసూర్‌కు చెందిన తన మాజీ భర్త ఆదిల్‌ చేసిన ఫిర్యాదు కారణంగానే ఇలా బ్రతుకుతున్నా అని తెలిపింది.

రాఖీ సావంత్ మాజీ భర్త మైసూర్‌కు చెందిన ఆదిల్ రాఖీపై మోసం, దొంగతనం, పరువు నష్టం, ఇతర ఫిర్యాదులను దాఖలు చేశారు, రాఖీ సావంత్ భారతదేశానికి వస్తే ఆమెను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. అందుకే ఆమె  దుబాయ్‌కు పారిపోయింది. గత కొన్ని వారాలుగా అక్కడే నివాసముంటున్నరాఖి.. డబ్బులు లేకపోవడంతో బిచ్చగత్తెలా జీవిస్తున్నా అని తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఎంత సహాయం కోరినా, ఎంతమందిని అడిగినా.. ఫలితం లేదు.. నా జీవితం బిచ్చగత్తెలా మారింది. నాకు భారత చట్టంపై నమ్మకం ఉంది, నేను తిరిగి భారతదేశానికి వెళ్తున్నాను” అని రాఖీ సావంత్ అన్నారు.

బాలీవుడ్‌లో దశాబ్దాలుగా ఉన్న రాఖీ సావంత్, సల్మాన్ ఖాన్, ఫర్హాన్ ఖాన్, షారుక్ ఖాన్.. లను ఎందుకు సాయం అడగడంలేదు అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘నేను ఎవరినీ సహాయం అడగను. ఇది నేనే పోరాడే నా పోరాటం. ఒక్క నిమిషంలో నాకు బెయిల్ ఇవ్వగలరని నేను షారూఖ్ , సల్మాన్‌లను అదగ్గొచ్చు.., కానీ నేను అలా చేయను, ఈ యుద్ధంలో నేనే పోరాడతాను’ అని రాఖీ సావంత్ తెలిపింది. రాఖీ సావంత్, మైసూర్ వ్యాపారవేత్త ఆదిల్ ఖాన్ మే 2022 లో వివాహం చేసుకున్నారు. ఆదిల్, రాఖీకి కార్లను కూడా బహుమతిగా ఇచ్చారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఆదిల్‌పై రాఖీ సావంత్ ఫిర్యాదు చేసింది. దాంతో అతని పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో ఆదిల్ కొంతకాలం జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదిల్, రాఖీలపై మోసం, దొంగతనం కేసు వేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో రాఖీ సావంత్ దుబాయ్ పారిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
బాయిలోనే బల్లిపలికే ఫోక్ సాంగ్‌కు ఎన్ని లక్షలు వచ్చాయంటే..
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి