AP Madhiga Vs Madhiga: ఎన్నికలవేళ కొత్త లొల్లి.. రాజుకుంటున్న మాదిగ వర్సస్ మాదిగ వివాదం
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పంచాయితీ షురూ అయ్యింది. మాదిగ వర్సస్ మాదిగ వివాదం రాజుకుంటోంది. కూటమి అభ్యర్థులకు ఓట్లు వెయ్యాలంటూ పిలుపు నిచ్చిన మందకృష్ణ మాదిగ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పలు మాదిగ సంఘాలు. మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా సమావేశమైన ఏకగ్రీవ తీర్మానం చేశాయి. 25 మాదిగ సంఘాలు..వర్గీకరణ పేరుతో ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించాయి.

ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సమావేశమయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. వర్గీకరణ విషయంలో మాదిగలను జగన్ మోసం చేశారని ఆరోపించిన మందకృష్ణ.. టీడీపీ అధికారంలో రాగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. మాదిగలంతా కూటమి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే కూటమి పార్టీలకు ఓట్లు వెయ్యాలంటూ మందకృష్ణ మాదిగ పిలుపు నివ్వడానికి ఇతర మాదిగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
మంద కృష్ణ మాదిగకు కౌంటర్‌గా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన 25 మాదిగ సంఘాలు..వచ్చే ఎన్నికల్లో జగన్‌కే తమ మద్దతు అని స్పష్టం చేశాయి. వర్గీకరణ పేరుతో చంద్రబాబు, మందకృష్ణలు 30 ఏళ్లుగా మాదిగలను మోసం చేస్తున్నారని.. ఎస్సీ వర్గీకరణ ద్వారా 22 వేల ఉద్యోగాలొచ్చాయనేది పచ్చి అబద్ధమని మాదిగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వందమంది మాదిగల్లో పది మందికి మాత్రమే లబ్ధి జరిగేదని.. సీఎం జగన్ హయాంలో వందకి తొంబై కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. మాదిగల ఆత్మ గౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న నేతలు.. తమకు మేలు చేసిన జగన్ ప్రభుత్వానికి ఎన్నికల్లో మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.
మందకృష్ణ మాదిగ మద్దతిచ్చిన బీజేపీ ప్రభుత్వం..వర్గీకరణ బిల్లును ఎందుకు ఆమోదించలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు ఏపీ మాదిగ సంఘం నేతలు. టీడీపీకి అనుకూలంగా మందకృష్ణ ఎత్తుగడలను తిప్పికొడతామన్నారు. ఈ నెల 30న మందకృష్ణ మాదిగ తలపెట్టిన సమావేశాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మరి ఏపీలో ఈ మాదిగ వర్సస్ మాదిగ పంచాయితీ ఎంతవరకూ వెళ్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…