BJP Focus on Assembly Seats: ప్రయోగానికి సిద్ధమైన బీజేపీ.. బలం లేని చోట బరిలోకి..!

అంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లపై భారతీయ జనతా పార్టీలో క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఇప్పటికే కొత్త పాత చిచ్చుతో సీనియర్లు రగిలిపోతున్నారు. గత 20 ఏళ్లలో బీజేపీ పోటీ చేయని, అసలు పార్టీ బలంగా లేని స్థానాలను కేటాయించారంటే బీజేపీ రాష్ట్ర నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా కుట్ర ప్రకారం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సీట్లు సర్ధబాటు చేశారంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

BJP Focus on Assembly Seats: ప్రయోగానికి సిద్ధమైన బీజేపీ.. బలం లేని చోట బరిలోకి..!
AP BJP
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 29, 2024 | 8:26 AM

అంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లపై భారతీయ జనతా పార్టీలో క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఇప్పటికే కొత్త పాత చిచ్చుతో సీనియర్లు రగిలిపోతున్నారు. గత 20 ఏళ్లలో బీజేపీ పోటీ చేయని, అసలు పార్టీ బలంగా లేని స్థానాలను కేటాయించారంటే బీజేపీ రాష్ట్ర నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా కుట్ర ప్రకారం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సీట్లు సర్ధబాటు చేశారంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

నియోజకవర్గాల వారీగా భారతీయ జనతా పార్టీ ఏ ఈక్వేషన్స్‌పైన ఈ పది అసెంబ్లీ స్థానాలు తీసుకుంది అనేదీ ఇప్పుడు బీజేపీ సీనియర్ నేతల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్లు ఆశించిన స్థానాలు కాకుండా అసలు బీజేపీ గత 20 ఏళ్లలో పోటీలో లేనటువంటి స్థానాల్లో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడం వెనకాల ఆంతర్యం ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్లకు సీట్లు రాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరోపక్క ప్రస్తుతం బరిలోకి దిగుతున్న స్థానాల్లో బీజేపీ గెలుస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేతలు.

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి లెక్కలు చూసుకుంటే, ఎచ్చర్లలో బీజేపీ 2009లో పోటీ చేయగా కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి . ఇక 2014 ఇక్కడ కిమిడి కళా వెంకట్రావు గెలిచి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఇక 2019లో బీజేపీ తరఫున సూర్య ప్రకాష్ పోటీ చేయగా 0.5% ఓట్లు మాత్రమే వచ్చాయి ఈసారి ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్ ఈశ్వరరావు బరిలోకి దిగుతున్నారు. ఇక విశాఖ నార్త్ విషయానికొస్తే 2014 కూటమిలో బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు 51.34% ఓట్లతో గెలుపొందారు. అదే విష్ణు కుమార్ రాజు 2019లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ రావు చేతిలో ఓడిపోయారు. అప్పుడు 10.63% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కూడా ఇక్కడ విష్ణుకుమార్ రాజు బరిలోకి దిగబోతున్నారు.

ఇక అరకులో గత 20 ఏళ్లలో అసలు బీజేపీ లేనేలేదు. ఈ ఎన్నికల్లో అరకు వ్యాలీ నుండి పంగి రాజారావు బరిలోకి దిగబోతున్నారు. ఇక 2014లో కైకలూరు నుంచి కూటమిలో బరిలోకి దిగిన కామినేని శ్రీనివాస్ 53.80% ఓట్లతో విజయం సాధించారు. గత 20 ఏళ్లలో బీజేపీ ఇక్కడ ఒక్కసారి మాత్రమే గెలుపు తన ఖాతాలో వేసుకోగలిగింది. విజయవాడ వెస్ట్ లో 2014లో బీజేపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు సుజనా చౌదరి బరిలోకి దిగబోతున్నారు. బద్వేల్ విషయానికొస్తే 2009లో మాత్రమే సింగమల వెంకటేశ్వర్లు పోటీ చేయగా 1.05 శాతం ఓట్లు మాత్రమే సంపాదించగలిగారు. ప్రస్తుతం బొజ్జ రోషన్న అనే కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించింది బీజేపీ. జమ్మలమడుగులో కూడా గత 20 ఇళ్లలో బీజేపీ పోటీ చేసిందీ లేదు. ఇక ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. ఆదోని ధర్మవరం ఈ రెండిట్లో కూడా బీజేపీ గత 20 ఏళ్లలో పోటీ చేయలేదు. ఇక ఇప్పుడు ఆదోనిలో డాక్టర్ పివి పార్థసారధి బరిలోకి దిగుతున్నారు. ధర్మవరంలో సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు.

ప్రస్తుతం బీజేపీ పోటీ చేస్తున్న ఈ పది స్థానాల్లో కేవలం రెండు మూడు చోట్ల మాత్రమే బీజేపీ పోటీ చేసింది తప్పా, గత 20 ఏళ్లలో ఈ పది స్థానాల్లో బీజేపీ పోటీ చేసినటువంటి దాఖలాలు లేవనే చెప్పాలి..! ఇక పోటీ చేసిన చోట కూడా ఓటు శాతం మరింత తక్కువే..! విశాఖ నార్త్, కైకలూరులో మాత్రమే ఈ 20 ఏళ్లలో బీజేపీ గెలుపు సాధించింది. ఇక మిగతా అన్నిచోట్ల ఆపార్టీ మరుగడే లేనటువంటి పరిస్థితి..! దాంతో ఇప్పుడు బీజేపీ పోటీ చేయబోతున్న ఈ పది స్థానాల్లో గెలుపు కష్టం అంటున్నారు సీనియర్లు. ఒకపక్క సీనియర్లు తమకు సీట్లు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూనే పార్టీ బలంగా లేని చోట్ల టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికే ఓటు బ్యాంకు వంకతో అవకాశాలు ఇచ్చారు అంటున్నారు. బీజేపీ ప్రకటించిన ఈ పది స్థానాల్లో కూడా ఎన్నో ఏళ్లగా పనిచేస్తున్న అసలైన వారి కంటే కూడా వలస వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని ఆ పార్టీ నేతలే మండిపడుతున్నారు. చూడాలి మరీ ఎంత మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారో..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!