AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇవాళే బ్యాంకు అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ.. వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ..

నాలుగో సంవత్సరం, మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసాలో భాగంగా.. ఇటీవల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో.. బహిరంగ వేదిక ఏర్పాటు చేశారు.

YS Jagan: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇవాళే బ్యాంకు అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ.. వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ..
AP Cm Ys Jagan Mohan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2023 | 7:30 AM

Share

ఏపీ సీఎం జగన్ గుంటూరు జిల్లా, తెనాలి పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగో సంవత్సరం, మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసాలో భాగంగా.. ఇటీవల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో.. బహిరంగ వేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడకి కిలోమీటర్ దూరంలోని కవిరాజనగర్లో హెలి ప్యాడ్ రూపొందించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, తదితర అధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు పెద్ద ఎత్తున సభా స్థలికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. నియోజకవర్గం నుంచి రైతాంగం హాజరయ్యేలా చూస్తున్నారు పార్టీ లీడర్లు. మూడో విడతగా ఒక్కొక్కరికి 2 వేల చొప్పున 51.12 లక్షల రైతుల ఖాతాల్లో 1090.76 కోట్ల నిధులు జమ చేయనున్నారు. మూడున్నరేళ్లలో ఈ పధకం కింద 27 వేల 062.09 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. గత డిసెంబర్‌లో మాండోస్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన 91,237 మంది రైతులకు 6.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సైతం సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తెనాలికి వస్తున్న ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఈరోజు ఉదయం బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఇక షెడ్యూల్ ఎలా ఉందని చూస్తే.. ఉదయం 9 గంటల 50 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుండి హేలిపాడ్ కు చేరుకుంటారు సీఎం జగన్. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో 10 గంటలకు బయలుదేరి పదింబావుకల్లా కవిరాజనగర్ చేరుకుంటారు. తెనాలి ప్రజా ప్రతినిధులతో మాట్లాడి.. అక్కడి నుంచి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆపై బహిరంగ సభకు పదీ ముప్పైఐదుకు రీచ్ అవుతారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ సందర్శించి లబ్ధిదారులతో ఫోటోలు దిగుతారు. పదిముప్పావు నుంచి పన్నెండుంబావు మధ్య రైతులకు నాలుగో సంవత్సరం, మూడో విడత వైయస్సార్ రైతు భరోసా సీఎం కిసాన్ ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేస్తారు. 12గంటల 20 నిమిషాలకు హెలిపాడ్ కి చేరుకుని బయలుదేరి వెళతారు. అక్కడ పదిహేను నిమిషాల పాటు స్థానిక నేతలతో ముచ్చటించి పన్నెండుముప్పావుకు హెలికాప్టర్లో తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.