YSR Vahana Mitra: వైఎస్‌ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల.. డ్రైవర్లకు భరోసా కల్పించిన సీఎం జగన్..
YSR Vahana Mitra: YSR వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
YSR వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు సీఎం జగన్. 2 లక్షల 48 వేల 468 మంది లబ్ధిదారులకు 248 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం లభిస్తోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర అమలు చేశామని వెల్లడించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో నేరుగా చూడటం ద్వారా వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంది దేశంలో ఏపీ ఒక్కటేనని, దేశంలో ఎక్కడా డ్రైవర్ల కోసం ఇలాంటి పథకం లేదని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక సాయం ఎంతో మేలు చేస్తుందని, వాహన బీమాతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రిపేర్లకు రూ.10వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనంలో ప్రయాణించే వారికి కూడా భద్రత ఉంటుందని, వైఎస్ఆర్ వాహనమిత్ర దరఖాస్తుకు మరో నెలపాటు గడువు ఉందన్నారు.
ఈ పథకం కింద ప్రయోజనం కలుగుతుంది. వరుసగా మూడో ఏడాది కూడా ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుండటం విశేషం. నేడు జమ చేసిన నగదుతో కలిపి ఇప్పటివరకు రూ.759 కోట్లను డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసింది.