AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: ‘ఫైన్లు వేస్తున్నా మార‌రా..?’.. ఆక‌తాయిల‌కు వైజాగ్ పోలీసుల సీరియ‌స్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి వస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో కొద్ది రోజులుగా పాజిటివ్‌ కేసులు....

Visakhapatnam: 'ఫైన్లు వేస్తున్నా మార‌రా..?'.. ఆక‌తాయిల‌కు వైజాగ్ పోలీసుల సీరియ‌స్ వార్నింగ్
visakhapatnam police
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2021 | 9:29 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి వస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో కొద్ది రోజులుగా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక రాష్ట్రంలో పూర్తిస్థాయిలో కరోనాను రూపుమాపేందుకు మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది ప్రభుత్వం. అయితే కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రజలు కట్టు తప్పుతున్నారు. విశాఖపట్నంలో కర్ఫ్యూ సమయంలోనూ జనం అధిక సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో రోడ్లపైకి వస్తూ లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తున్నారు. కంచరపాలెం మెట్టు, గోపాలపట్నంలో లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపై వందలాది వాహనాలు తిరుగుతున్నాయి. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకి రావొద్దని పోలీసులు నచ్చజెపుతున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. మరికొంత మందిపై కేసులు నమోదు చేస్తున్నారు. అయినా పోలీసుల హెచ్చరికను బేఖాతార్‌ చేస్తూ రోడ్లపై ఇష్టారీతిన తిరుగుతున్నారు. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ఈ సమయంలో ప్రజలు కట్టు తప్పడం వల్ల కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అనవసరంగా బయటకి వచ్చే వారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ క్ర‌మంలో వైజాగ్ పోలీసులు ఆక‌తాయిల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. అతి చేస్తే అంటువ్యాధుల చట్టం (​ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌) కింద కేసులు న‌మోదు చేస్తామ‌ని.. క‌ఠిన శిక్ష‌లు ప‌డతాయ‌ని హెచ్చ‌రించారు.

Also Read: విశాఖ జిల్లా డౌనూరు గ్రామంలో విక‌శించిన బ్ర‌హ్మ‌క‌మలం.. ప్ర‌త్యేక పూజ‌లు చేసిన గ్రామ‌స్థులు

వైద్య విద్య చదవాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఏపీలోని వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే