TTD: తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో బయటపడ్డ మరో నకిలీ వెబ్‌సైట్..
తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో నకిలీ వెబ్‌సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. అనంతరం తిరుమల్ వన్ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏపీ ఫోరెన్సిక్ సైబర్ అప్పగించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో నకిలీ వెబ్‌సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించింది. అనంతరం తిరుమల్ వన్ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏపీ ఫోరెన్సిక్ సైబర్ అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్‌సైట్ పై విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానంపై 40 నకిలీ వెబ్‌సైట్లు నమోదయ్యాయి. ఇప్పుడు దీంతో కలిపి ఈ సంఖ్య 41 కి చేరింది.
అయితే అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఇలా ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు రూపొందించిన https://tirupatibalaji-ap-gov.org/ వెబ్‌సైట్‌ను టీటీడీ గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..