AP: నా తప్పు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటా..ఆస్తుల్ని రాసిస్తా..మాజీ మంత్రి బాలినేని సంచలన కామెంట్స్
ఇటీవల ఏపీలో మాజీ అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ప్రముఖ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు విశాఖపట్నం జనసేన కార్పోరేటర్ ఆరోపించారు. అయితే దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు.
ఇటీవల ఏపీలో మాజీ అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. ప్రముఖ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు విశాఖపట్నం జనసేన కార్పోరేటర్ ఆరోపించారు. అయితే దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. విశాఖ జనసేన కార్పొరేటర్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు. అయితే తనకు సినీ ఇండస్ట్రీలో దిల్ రాజు లాంటి స్నేహితులు చాలా మంది ఉన్నారని తెలిపారు. అంతమాత్రాన సినిమాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించడం సరికాదన్నారు.
జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి సూచించారు. మైత్రి మూవి మేకర్స్ లో పెట్టుబడులు పెట్టిన ప్రజాప్రతినిధిని వదిలేసి తనను టార్గెట్ చేయడం వెనుకు ఏదో కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ విచారణలో తాను పెట్టుబడులు పెట్టినట్లు తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని….తన ఆస్తుల్ని మీకే రాసిస్తానని సవాలు చేశారు. లేకపోతే జనసేన కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని.. అందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..