AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KA Paul: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొంటా.. 15 రోజుల్లో రూ.4వేల కోట్లిస్తా.. పవన్, మాజీ జేడీ నాతో కలిసి నడుస్తారన్న కేఏ పాల్

విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలు కోసం నేను ఉన్నానంటూ ముందుకొచ్చారు కే ఏ పాల్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కొనుగోలు చేయడం కోసం రూ. 42 వేల కోట్లకు బిడ్ వేయనున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ స్పష్టం చేశారు.

KA Paul: విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొంటా.. 15 రోజుల్లో రూ.4వేల కోట్లిస్తా.. పవన్, మాజీ జేడీ నాతో కలిసి నడుస్తారన్న కేఏ పాల్
Ka Paul
Surya Kala
|

Updated on: Apr 23, 2023 | 12:27 PM

Share

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన  విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణ చేస్తామంటూ కేంద్ర ప్రకటించినప్పటి నుంచి నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఉద్యోగుల నుంచి రాజకీయ నాయకులు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపించారు. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం కొనుగోలు కోసం నేను ఉన్నానంటూ ముందుకొచ్చారు కే ఏ పాల్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కొనుగోలు చేయడం కోసం రూ. 42 వేల కోట్లకు బిడ్ వేయనున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ స్పష్టం చేశారు. అయితే వేలంలో పాల్గొంటాడు కొన్ని లెటర్స్ అవసరం అని.. వాటిని ఇవ్వమని సదరు అధికారులు తాను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. వేలం వేయడానికి కావాల్సినవి అన్నీ పూర్తి చేసి.. 15 రోజుల్లో వేలంలో పాల్గొనడానికి దరఖాస్తు పెడతానని వెల్లడించాడు కేఏ పాల్.

అయితే వాస్తవానికి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విలువ రూ. రూ.3.5 లక్షల కోట్లు ఉంటుందని.. అయితే కేంద్రం దానిని రూ.3,500 కోట్లకు అమ్మేద్దామని చూస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అని అందరం కలిసి కాపాడుకోవాలని తెలిపారు. అందుకనే వైసీపీ, టీడీపీ, సిపిఐ నేతలను కలవనున్నానని వెల్లడించారు.

గత చంద్రబాబు ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే.. ఇప్పటి సీఎం  జగన్‌ మరో రూ.4 లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగజార్చారు అంటూ ఇరు ప్రభుత్వాలపై సంచలన కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నివసిస్తున్న తండ్రి బర్నబాస్‌ను కేఏ పాల్‌ కలిశారు. ఈ సందర్భంగా స్థానికులతో పలు విషయాలపై మాట్లాడారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద స్థానికులను పలకరించారు. తనను ఏపీకి సీఎం గా చేస్తే రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఒక్క ఏడాదిలో పూర్తి చేస్తానని చెప్పారు. అంతేకాదు.. తన ప్రజాశాంతి పార్టీతో కలిసి పనిచేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యణ్, మాజీ జేడీ లక్ష్మీనారాయణ రెడీ ఉన్నారంటూ  కేఏ పాల్‌ మరోసారి స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..