Vijayawada: ఒకరి వెంట ఒకరు.. మరణంలోనూ వీడని మాంగల్య బంధం!
గంపలగూడెంకు చెందిన చిల్లర దుకాణ యజమాని కోడుమూరి నాగేశ్వరరావు (65) రమాదేవి (59) దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. నాగేశ్వరరావు కొంతకాలంగా లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత పది రోజులుగా విజయవాడలో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నాగేశ్వరావు మృతి..

విజయవాడ, ఆగస్టు 2: వివాహ సమయంలో పెద్దలు వేదమంత్రాలు, అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన దంపతులు చివరి మజిలీలో కూడా కలిసే ప్రయాణం చేశారు. జీవితాంతం తోడునీడగా ఉంటానని చేసిన పెళ్లినాటి ప్రమాణాన్ని పాటిస్తూ భర్త వెంట తుదివరకు నడిచిన ఆ ఇల్లాలు భర్త మరణాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోయింది. భర్త మరణించిన గంటల వ్యవధిలోని తనువు చాలించింది. అతనితో పాటు వెళ్లిపోయింది.
గంపలగూడెంకు చెందిన చిల్లర దుకాణ యజమాని కోడుమూరి నాగేశ్వరరావు (65) రమాదేవి (59) దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందారు. నాగేశ్వరరావు కొంతకాలంగా లివర్ ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత పది రోజులుగా విజయవాడలో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నాగేశ్వరావు మృతి చెందారు. ఆదివారం వరకు భర్త వద్దే ఉండి సేవలందించిన రమాదేవి ఇంటికి వచ్చింది. భర్త మృతి చెందినట్లు ఇంటి వద్ద ఉన్న రమాదేవికి బంధువులు తెలిపారు. భర్త మరణ వార్త వినగానే తీవ్ర మనస్థాపం ఆవేదనతో షాక్కుకు గురైన ఆమె ఆకస్మికంగా మృతి చెందింది. మాంగల్య బంధంతో జీవన ప్రమాణం సాగించిన దంపతులు మరణంలో కూడా కలిసి వెళ్లడం గ్రామస్తులను విస్మయానికి గురిచేసింది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
