తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరిక
ఓ తాగుబోతు ఆలయ శిఖరం ఎక్కాడు. అంతకంటే ముందు అతడు ఆలయంలోకి చొరబడ్డాడు. అదేదో ఆషామాషీ ఆలయం కాదు. తిరుపతిలోని ప్రసిద్ధ గోవిందరాజస్వామి గుడి. ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లాడు అజ్ఞాత వ్యక్తి . సెక్యూరిటీ బాగా ఉండే ఈ టెంపుల్‌లోకి ఒక తాగుబోతు ఎలా వచ్చాడు?

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ భద్రతలో డొల్లతనం మరోసారి బయట పడింది. అర్ధరాత్రి హైడ్రామా ఒక హల్చల్ చేయడంతో భద్రత వైఫల్యం వెలుగు చూసింది. ఆలయం మూసి వేశాక లోపలికి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హాల్‌చల్ చేయడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. మద్యం మత్తులో ఆలయం లోపలికి ప్రవేశించినట్లు గుర్తించగా విజిలెన్స్ సిబ్బంది కళ్ళుగప్పి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది.
ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లిన అజ్ఞాత వ్యక్తి గోవిందరాజు స్వామిని దర్శించుకునేందుకు కాకుండా ఏకంగా ఆలయ గోపురం ఎక్కి హంగామా చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఆలయం వద్దకు ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. గోపురంపై వ్యక్తిని కిందకు ఇంకెందుకు బ్రతిమిలాడారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మద్యం బాటిల్ కావాలని డిమాండ్ వినిపించాడు. దీంతో దిక్కుతోచక పోలీసులు, ఫైర్ సిబ్బంది టిటిడి సెక్యూరిటీ గోపురం పై నుంచి కిందకు దిగాలని వేడుకున్నారు.
ఏకాంత సేవ అనంతరం మద్యం మత్తులో ఆలయంలోకి వెళ్లన వ్యక్తిని కిందకు దింపేందుకు దాదాపు మూడు గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. ఆలయం గోపురం పై ఉన్న కలశాలు, విద్యుత్ దీపాలు డామేజ్ చేసిన వ్యక్తిని గోపురం పై నుంచి కిందకు దింపారు. 3 గంటలపాటు శ్రమించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది తాళ్ళు, నిచ్చెన సాయంతో ఆలయ గోపురం ఎక్కి అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారించి అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తామన్నారు ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
