AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gym Tips for Beginners: కొత్తగా జిమ్‌కు వెళ్తున్నారా? వర్కవుట్ మొదలుపెట్టే ముందు తెలుసుకోవాల్సిన గోల్డెన్ రూల్స్ ఇవే!

బాడీ ఫిట్‌నెస్ కోసమో .. హెల్దీ లైఫ్ కోసమో .. జిమ్‌లో అడుగు పెట్టాలని నిర్ణయించుకోవడం మీ ఆరోగ్యానికి మీరు ఇచ్చుకునే అతిపెద్ద బహుమతి. అయితే, జిమ్‌లో ఉత్సాహంగా వర్కవుట్లు మొదలుపెట్టే ముందు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Gym Tips for Beginners: కొత్తగా జిమ్‌కు వెళ్తున్నారా? వర్కవుట్ మొదలుపెట్టే ముందు తెలుసుకోవాల్సిన గోల్డెన్ రూల్స్ ఇవే!
Gym Tips For Beginners.jpg
Nikhil
|

Updated on: Feb 19, 2026 | 9:29 PM

Share

సరైన సన్నద్ధత లేకపోతే జిమ్ ప్రయాణం ఉత్సాహంగా సాగకపోగా, అనవసరమైన నొప్పులకు దారితీసే అవకాశం ఉంది. కొత్తగా జిమ్‌కు వెళ్లేవారు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో చూద్దాం. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం జిమ్‌లో చేరడం అనేది ఒక గొప్ప ముందడుగు. కానీ, జిమ్‌కు వెళ్లడం అంటే కేవలం అక్కడ ఉన్న మెషిన్లను వాడటం లేదా బరువులు ఎత్తడం మాత్రమే కాదు. బాడీ బిల్డింగ్ లేదా వెయిట్ లాస్ ప్రయాణం సజావుగా సాగాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. చాలామంది మొదటి రోజే ఉత్సాహంతో వెళ్ళి, రెండో రోజు ఒళ్లు నొప్పులతో మంచం పడతారు. అలా జరగకుండా ఉండాలంటే మీరు కొన్ని వస్తువులను, పద్ధతులను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.

సరైన దుస్తులు, బూట్లు..

చాలామంది వ్యాయామం అలవాటు అయ్యే వరకు ఏదో ఒక పాత బూట్లు లేదా బిగుతుగా ఉండే సాధారణ దుస్తులతో మేనేజ్ చేద్దామనుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. నాసిరకం బూట్లు వాడటం వల్ల పాదాల నొప్పి మాత్రమే కాకుండా, మోకాళ్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వర్కవుట్ చేసేటప్పుడు పాదాలకు సరైన గ్రిప్ ఇచ్చే స్పోర్ట్స్ షూస్ తప్పనిసరి. అలాగే గాలి ఆడని దుస్తులు ధరిస్తే శరీరం త్వరగా వేడెక్కి, విపరీతమైన చెమట వల్ల మీరు త్వరగా అలసిపోతారు. కాబట్టి, శరీరానికి సౌకర్యంగా ఉండే ట్రాక్ సూట్లు ఎంచుకోవడం వల్ల మీ ఉత్సాహం రెట్టింపవుతుంది.

వ్యాయామం చేసేటప్పుడు శరీరం చెమట రూపంలో ద్రవాలను కోల్పోతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడి కళ్లు తిరగడం, విపరీతమైన నీరసం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోండి. వర్కవుట్ మధ్యలో దాహం వేసినప్పుడు ఒకేసారి లీటర్ల కొద్దీ నీరు తాగకుండా, చిన్న చిన్న గుటకలు వేస్తూ ఉండాలి. ఇది మీ గుండె వేగాన్ని అదుపులో ఉంచి, మీరు ఎక్కువ సేపు వ్యాయామం చేసేలా సహకరిస్తుంది.

జిమ్‌లోకి వెళ్లగానే నేరుగా హెవీ వెయిట్స్ ఎత్తడం వంటివి చేయకూడదు. మీరు చేసే వ్యాయామం ఏదైనా సరే, దానికి ముందు శరీరాన్ని సిద్ధం చేయడానికి వార్మ్‌అప్ తప్పనిసరి. మొత్తం వ్యాయామ సమయంలో పావు వంతు సమయాన్ని దీనికే కేటాయించాలి. ఇది కండరాలను ఫ్లెక్సిబుల్‌గా మారుస్తుంది. ఇక ఒంటిని సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలను వర్కవుట్ చివర్లో చేయడం వల్ల మరుసటి రోజు ఒళ్లు నొప్పులు రాకుండా ఉంటాయి. ఫిట్‌నెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. దానికి క్రమశిక్షణ, ఓపిక చాలా అవసరం. సరైన ఆహారం తీసుకుంటూ, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీ జిమ్ ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. ఫలితాల కోసం తొందరపడకుండా ప్రతిరోజూ చిన్న మార్పులను ఆస్వాదించండి.

Follow Us