Kanaka Durga Temple: చరిత్రలో మొదటిసారి.. తిరుమల తర్వాత రికార్డ్ స్థాయిలో విజయవాడ కనక దుర్గమ్మకు ఆదాయం
ఏపీలోని ప్రధాన ఆలయాలలో ఒక్కటైన విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం చాలా ఫేమస్. ఎంతోమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకనేందుకు వస్తుంటారు. అయితే ఈసారి అమ్మవారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. ఈ ఏడాది 150 కోట్ల రూపాయల వివిధ రూపాలలో ఆదాయం సమకూరింది. గత ఏడాడి 86 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. అయితే ఈ ఏడాది గత ఏడాది కంటే రెట్టింపు ఆదాయం సమకురినట్లు దుర్గగుడి ఈఓ తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
