రివర్స్ చేస్తుండగా తప్పిన కంట్రోల్.. వాహనాలపై దూసుకెళ్లిన కారు.. సీసీ కెమెరాలో భయానక దృశ్యాలు!
కర్ణాటకలోని ఉడిపిలో ఘోర ప్రమాదం జరిగింది. కారు రివర్స్‌లో తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా వెనుకకు కదిలింది. కారు అదుపుతప్పి టూ వీలర్ వాహనంతోపాటు ఆటో రిక్షా ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఉడిపిలోని జామియా మసీదు సమీపంలోని ఇరోడి భవనం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇరోడి భవనం వద్ద ఆగి ఉన్న కారును రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల, కారు పరివార్ స్వీట్స్ దుకాణం వైపు వేగంగా వెనుకకు కదిలింది. ఈ క్రమంలో, సిటీ సెంటర్ రోడ్డు నుండి సంస్కృత కళాశాల వైపు వెళ్తున్న బైక్, ఆటో రిక్షాను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ రైడర్, ఆటో రిక్షా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టి, చివరికి చిప్స్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన CCTV కెమెరాలో రికార్డైంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కారు ప్రమాదానికి సంబంధించి భయానక దృశ్యాలు ఇక్కడ చూడండి..
Udupi, Karnataka⚠️ Disturbing visuals: An automatic car reportedly moved due to possible confusion between the brake and accelerator pedals. The car door was also not properly closed. The vehicle moved slightly forward and then rolled back.pic.twitter.com/9HpfRZNO3d
— Deadly Kalesh (@Deadlykalesh) January 2, 2026
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..