AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: ఉద్యోగం కోల్పోయారా..? కేంద్రం నుంచి మీ అకౌంట్లోకి డబ్బులు.. 45 రోజుల్లోపే..

ఉద్యోగం కోల్పోయినవారి కోసం కేంద్ర ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ గురించి చాలామందికి తెలియదు. ఇటీవల లేఆఫ్స్ ఎక్కువగా జరుగుతున్న తరుణంలో ఈ పథకం గురించి చర్చ జరుగుతోంది. ఉద్యోగం కోల్పోయినవారికి భద్రత కల్పించేందుకు కేంద్రం కొత్త నియమాలు తెచ్చింది.

Central Government: ఉద్యోగం కోల్పోయారా..? కేంద్రం నుంచి మీ అకౌంట్లోకి డబ్బులు.. 45 రోజుల్లోపే..
telangana Unemployes
Venkatrao Lella
|

Updated on: Jan 03, 2026 | 8:00 AM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం అభివృద్ది చెందటం, ప్రపంచవ్యాప్తంగా అర్ధిక అనిశ్చితి నెలకొన్న సమయంలో అన్నీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో లేఆఫ్స్ భారీగా జరుగుతున్నాయి ఏఐ రాకతో కొత్త ఉద్యోగాలు పుట్టుకురాకపోగా.. ఇప్పటికే ఉన్న ఉద్యోగాలకు కొత పడుతోంది. 10 మంది ఉద్యోగులు చేసే పనిని ఏఐ ఉపయోగించి ఇద్దరు ఉద్యోగులు చేసే అవకాశం లభించింది. దీంతో కంపెనీలన్నీ ఏఐను తమ సంస్థల్లో ఉపయోగిస్తూ ఉద్యోగులను పీకేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎమ్‌ఎన్‌సీ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు అందరూ ఉద్యోగులు లేఆఫ్ బారిన పడి రోడ్డున పడుతున్నారు. ఉద్యోగం లేకపోతే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారి అప్పులు చేయాల్సి వస్తోంది.

45 రోజుల్లోపే అకౌంట్లోకి డబ్బులు

చిన్న ఉద్యోగుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు పదే బాధ అంతా ఇంతా కాదు. లక్షల మంది ఉద్యోగులు కోల్పోతున్న తరుణంలో వీరికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రీయల్ రిలేషన్స్ కోడ్ 2020 మసాయిదా నియమాలను అమలు చేస్తోంది. ఈ నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందిస్తోంది. ఉద్యోగం కోల్పోయిన 45 రోజుల్లోపు ఉద్యోగి అకౌంట్లో వీటిని నేరుగా జమ చేస్తోంది. ఉద్యోగం కోల్పోయాక కొత్త ఉద్యోగంలో చేరేందుకు స్కిల్స్ నేర్చుకునేందుకు ఈ సొమ్మును అందిస్తోంది. ఉద్యోగి కొత్త నైపుణ్యాలు, త్వరగా ఉపాధిని పొందేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. కేవలం ఆర్ధిక సహాయం అందిస్తే సరిపోదని, స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఎంత ఇస్తారంటే..?

ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో 15 రోజుల వేతనానికి సమానమైన నిధులను అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తోంది. కంపెనీ ఎవరైనా ఉద్యోగిని తొలగిస్తే 10 రోజుల్లోగా ప్రభుత్వానికి రీస్కిల్లింగ్ నిధిని అకౌంట్లో వేయాల్సి ఉంటుంది. ఈ సొమ్మునే ఉద్యోగి ఖాతాకు ప్రభుత్వం బదిలీ చేస్తోంది. ఈ రీస్కిల్లింగ్ ఫండ్ అనేది అన్ని స్థాయిల ఉద్యోగులకు అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల ఉద్యోగులు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అనేది అవసరం. అందుకే అందరికీ ఈ పథకం ద్వారా ప్రయోజనం చూకూర్చుతోంది. కంపెనీలు ఏడు రోజుల ముందే ఉద్యోగం నుంచి తొలగించే వ్యక్తి వివరాలను బహిరంగపర్చాలని ఈ నియమాల్లో ఉంది.