Krishna District: వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో.. తల్లీ, ఏడాది వయస్సు ఉన్న బిడ్డ స్పాట్‌లోనే
ఈ మధ్య కాలంలో వాటర్ హీటర్ మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి.పైగా ఇప్పుడు వర్షాకాలం కావటంతో వీటిని వాడే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మధ్య తరగతి సామాన్య ప్రజలంతా ఈ ఎలెక్ట్రిక్ వాటర్ హీటర్స్‌నే వాడుతుంటారు. వాటర్ హిటరే కదా అని లైట్ తీసుకుంటే మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సిందే. వాడే హీటర్ బ్రాండెడ్‌ది అయ్యి ఉండాలి. ఇంకా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
కృష్ణా జిల్లా, ఆగస్టు 2: అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తుంది…మరో 15 రోజుల్లో చిన్నారి దన్విక పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేద్దాం అని మాట్లాడుకున్న గంటల వ్యవధిలోనే ఘోరం జరిగిపోయింది…చిన్నారితో పాటు తల్లి కానరాని లోకాలకు వెళ్ళిపోయింది.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల పరిధిలోని జానకిరాంపురం బీసీ కాలనీలో వాటర్ హీటర్ విద్యుత్ షాక్ గురై తల్లి, కూతురు చనిపోయిన ఘటన అందరిని కలిచివేసింది. గ్రామానికి చెందిన వల్లభు అనూష (23), ఆమె కుమార్తె చిన్నారి వల్లభ దన్విక (ఏడాది వయసు) ఇంట్లో వాటర్ హీటర్ అకస్మాత్తుగా పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే నేలకి ఒరిగారు. చిన్నారికి స్నానం చేయించడానికి పెట్టిన హీటర్ ఇద్దరినీ మింగేసింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో బయటవారు వచ్చి చూసే వరకు జరిగిన ఘటన ఎవరికి తెలియక తల్లీబిడ్డలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. అనుకోకుండా సంబంధించిన ఈ ప్రమాదంతో జానకిరామపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మీరు వాటర్ హీటర్ వాడుతున్నారా ఎలాంటివి వాడాలి..ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…!!
ఈ మధ్య కాలంలో వాటర్ హీటర్ మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి.పైగా ఇప్పుడు వర్షాకాలం కావటంతో వీటిని వాడే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మధ్య తరగతి సామాన్య ప్రజలంతా ఈ ఎలెక్ట్రిక్ వాటర్ హీటర్స్‌నే వాడుతుంటారు. వాటర్ హిటరే కదా అని లైట్ తీసుకుంటే మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సిందే. వాడే హీటర్ బ్రాండెడ్‌ది అయ్యి ఉండాలి. కచ్చితంగా ప్లాస్టిక్ బకెట్ లో మధ్యలో ఒక కర్ర లాంటిది పెట్టి పెట్టాలి. స్విచ్ కట్టేసి హీటర్ బయటకు తీశాకే వేడి శాతం చెక్ చేసుకోవాలి. .అన్నిటికంటే ముఖ్యంగా వైర్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడన్నా తెగిపోతే దానికి ప్లాస్టర్ వేసి ఏం కాదులే అని నిర్లక్ష్యంగా అసలు వాడకూడదు. పిల్లలు ఉన్న ప్రదేశం నుండి చాల దూరంగా హీటర్‌ను పెట్టాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.