AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadi Saikumar: డబుల్ సంబరాలు.. రెండోసారి తండ్రైన హీరో ఆది సాయి కుమార్

ఆది సాయి కుమార్.. ఈ యంగ్ హీరో అసలు పేరు ఆదిత్య పూడిపెద్ది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఆది. ప్రేమకావాలి సినిమాతో హీరోగా పరిచయమైన ఆది.. ఆతర్వాత లవ్లీ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇటీవలే శంబాల సినిమాతో హిట్ అందుకున్నాడు.

Aadi Saikumar: డబుల్ సంబరాలు.. రెండోసారి తండ్రైన హీరో ఆది సాయి కుమార్
Hero Aadi Sai Kumar
Rajeev Rayala
|

Updated on: Jan 03, 2026 | 8:27 AM

Share

యంగ్ హీరో ఆది సాయి కుమార్. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూశాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. రీసెంట్ గా శంబాల సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. 25 సినిమాలు చేసిన ఆదికి హిట్లు మాత్రం మూడు నాలుగే.. ఎట్టకేలకు శంబాల సినిమాతో ఆది ఖాతాలో హిట్ పడింది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆది అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆది ఇంట్లో సంబరాలు డబుల్ అయ్యాయి. ఓ సంతోషకరమైన వార్తతో ఆది కుటుంబం ఆనందంలో తేలిపోతుంది. ఆది భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

2014 డిసెంబరులో రాజమండ్రి కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరుణను ఆది సాయి కుమార్ వివాహం చేసుకున్నాడు. ఈ లవ్లీ కపుల్ కు ముందుగా ఒక కూతురు. తాజాగా (2026 ప్రారంభంలో) రెండో బిడ్డగా మెగా బిడ్డకు జన్మనిచ్చారు ఈ జంట. దాంతో సాయి కుమార్ ఇంట సంబరాలు జరుగుతున్నాయి. ఇక ఆది సాయి కుమార్ సినీ కెరీర్ గురించి చెప్పాలంటే.. 2011లో “ప్రేమ కావాలి” సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది, ఆది బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డులు (ఫిలింఫేర్, SIIMA) గెలుచుకున్నాడు.

తర్వాత లవ్లీ, సుకుమారుడు (2013), గలిపటం (2014), గరం (2016), శమంతకమణి (2017), బ్లాక్ (2022), తీస్ మార్ ఖాన్ (2022) వంటి సినిమాలు చేశారు. చాలా సినిమాలు ఫ్లాప్ అయినా, ఆది నటనకు మంచి పేరు ఉంది. ఇక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శంబాల సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆది కేవలం నటుడు మాత్రమే కాదు..ఆది క్రికెట్ ప్లేయర్ కూడా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

రెండోసారి తండ్రైన హీరో ఆది సాయి కుమార్
రెండోసారి తండ్రైన హీరో ఆది సాయి కుమార్
ఉద్యోగం కోల్పోయారా..? కేంద్రం కొత్త పథకం.. 45 రోజుల్లో డబ్బులు
ఉద్యోగం కోల్పోయారా..? కేంద్రం కొత్త పథకం.. 45 రోజుల్లో డబ్బులు
కారు రివర్స్ చేస్తుండగా ఘోరం.. ఇద్దరికి సీరియస్..!
కారు రివర్స్ చేస్తుండగా ఘోరం.. ఇద్దరికి సీరియస్..!
మీరు ఎయిర్, వాటర్‌ ప్యూరిఫయర్ కొంటున్నారా? ఆగండి.. మీకో గుడ్‌న్యూ
మీరు ఎయిర్, వాటర్‌ ప్యూరిఫయర్ కొంటున్నారా? ఆగండి.. మీకో గుడ్‌న్యూ
తెలుగు రాష్ట్రాల్లో UIDAI ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే
తెలుగు రాష్ట్రాల్లో UIDAI ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?