Food Poison: కలుషిత ప్రసాదం తిని 79 మందికి పైగా అస్వస్థత.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న కండక్టర్
రాష్ట్రంలో ఘనంగా వినాయక చవితి సంబరాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ నవరాత్రుల్లో ప్రజలు ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోనున్నారు. కాగా తిరుపతి జిల్లా కేవీబిపురం మండలం ఆరె గ్రామంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామంలోని ఆలయంలో పంపిణీ చేసిన కలుషిత ప్రసాదం తిని 79 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా గ్రామంలోని ప్రజలు తీవ్ర..
కేవీబీపురం, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ఘనంగా వినాయక చవితి సంబరాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ నవరాత్రుల్లో ప్రజలు ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోనున్నారు. కాగా తిరుపతి జిల్లా కేవీబిపురం మండలం ఆరె గ్రామంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామంలోని ఆలయంలో పంపిణీ చేసిన కలుషిత ప్రసాదం తిని 79 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా గ్రామంలోని ప్రజలు తీవ్ర అశ్వస్థతకు గురయ్యారు. ప్రసాదం తిన్న వెంటనే వాంతులు, విరేచనాలతో గ్రామస్థులు బాధపడ్డారు. వెంటనే గ్రామంలోనే వైద్యా శాఖ అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. గుడిలోని వినాయక ప్రసాదాన్ని భక్తులు గ్రామంలోని ఇంటింటికి పంచినట్లు తెలుస్తోంది. ప్రసాదం తిన్న అనంతరం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన గ్రామస్తులు ప్రస్తుతం కేవీబీపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణలో మరో విషాదం.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఆర్టీసీ బస్సు కండక్టర్
వినాయక చవితి పర్వదినాన తెలంగాణ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ క్షణికావేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సోమవారం (సెప్టెంబర్ 18) ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌కు చెందిన సాయితేజ (24) బస్సు కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సాయితేజ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణిచడంతో తండ్రి కండక్టర్ ఉద్యోగం అతనికి వచ్చింది.
అయితే సాయితేజకు మద్యం అలవాటు ఉంది. మద్యం అలవాటుకు పూర్తిగా బానిసైన సాయితేజ గత కొంతకాలంగా విధులకు సక్రమంగా హాజరు కావట్లేదు. దీంతో సాయితేజ తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కండక్టర్ సాయితేజ నర్సాపూర్ ఆర్టీసీ డీపో సమీపంలో శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఒళ్లంతా మంటలతో అరుస్తోన్న సాయితేజను డిపో సెక్యూరిటీ సిబ్బంది పరుగు పరుగున వెళ్లి మంటలు ఆర్పారు. అనంతరం తీవ్రంగా గాయపడిన సాయితేజను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సాయితేజ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యాధికారులు మీడియాకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.