Illicit Relationship: ప్రియుడితో బెడ్‌రూమ్‌లో భార్య.. సడెన్ ట్విస్ట్ ఇచ్చిన భర్త.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి అక్రమ సంబంధాలు. నిండునూరేళ్లు కలిసి ఉంటామని చెప్పుకున్న మాటలు వట్టి మాటలే అవుతున్నాయి. మధ్యలో వచ్చే వ్యక్తులపై వ్యామోహంతో..

Illicit Relationship: ప్రియుడితో బెడ్‌రూమ్‌లో భార్య.. సడెన్ ట్విస్ట్ ఇచ్చిన భర్త.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Extra Marital Affair
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 04, 2023 | 2:24 PM

పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి అక్రమ సంబంధాలు. నిండునూరేళ్లు కలిసి ఉంటామని చెప్పుకున్న మాటలు వట్టి మాటలే అవుతున్నాయి. మధ్యలో వచ్చే వ్యక్తులపై వ్యామోహంతో.. పండంటి కాపురాలను కూల్చుకుంటున్నారు దంపతులు. ఈ అక్రమ సంబంధాలు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. పెద్ద పెద్ద పిల్లలు ఉన్న భార్య, భర్తలు సైతం ఇతరులపై మోజులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలే కాకుండా, వారి పిల్లల భవిష్యత్‌ను కూడా నాశనం చేస్తున్నారు. తాజాగా వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. ప్రియురాలి భర్తకు దొరక్కుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం.. ఆ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసేలా చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భర్త బయటకెళ్లడంతో ఆ ఇంటావిడ.. తన ప్రియుడిని పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి గదిలో ఏకాంతంగా ఉన్నారు. ఇంతలో బయటకెళ్లాడనుకున్న భర్త సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో షాక్‌కు గురైన ప్రియుడు.. అతనికి దొరక్కుండా ఉండేందుకు ఇంటి బాల్కనీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ ప్రయత్నం విఫలమై.. బాల్కనీ నుంచి జారిపడ్డాడు. మూడో అంతస్తు నుంచి జారి పడటంతో.. తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

విజయనగరం జిల్లాకు చెందిన నాయుడు(25) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే, తను ఇంటర్ చదివే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు నాయుడు. కానీ, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. అయినప్పటికీ నాయుడు, అమ్మాయి తమ సంబంధాన్ని రహస్యంగా కొనసాగించారు. ఈ క్రమంలోనే తాజాగా తోటపాలెంలోని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు నాయుడు. ఆమె భర్త లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఆమెతో ముచ్చటించాడు. అయితే, అంతలోనే ఆమె భర్త ఇంటికి వచ్చాడు. భయపడిపోయిన నాయుడు.. బాల్కనీ నుంచి కిందకు దిగి పారిపోయేందుకు ట్రై చేశాడు. అయితే, మూడవ అంతస్తులో ఉన్న ఈ బాల్కనీ నుంచి జారి కిందపడిపోయాడు నాయుడు. తీవ్రంగా గాయపడిన నాయుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గం మధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..