Andhra News: పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి
శనివారం కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ప్రమాదంలో గుడపర్తి వీధిలో నివాసం ఉంటున్న ఓకే కుటుంబంలో చెందిన అన్నదమ్ములు ముగ్గురు చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

వేట్లపాలెం బాణసంచా పేలుడు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముళ్లు చనిపోవడం కలచివేస్తోంది. పొట్టకూటి కోసం ఉదయాన్నే బాణసంచా తయారీకి వెళ్లిన మహేష్,నాని, చిన్ని మధ్యాహ్నానికి మృత్యుఒడికి చేరడంతో బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోధిస్తున్నాయి. వీరి ఇంట్లో ఇంకా పదవ తరగతి కూడా చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారికి ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేక పూరిపాక లోనే జీవనం ఉంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
పొట్టకూటి కోసం గత కొన్నేళ్లుగా ఇదే బాణసంచా కేంద్రానికి వెళ్తున్నారని వాపోయారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం నివాస గృహంతో పాటు తమ పిల్లల్ని చదివించాలని కోరుతుంది మృతుడి భార్య కోరుతుంది.
ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో సమార్లకోట పరిధిలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రాలన్నీ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. బాణాసంచా తయారీ కేంద్రాలు, సేల్స్ అవుట్ లెట్లకు నిర్వాహకులు తాళాలు వేసి వెళ్లిపోయినట్టు సమాచారం. దీంతో ఆయా తయారీ కేంద్రాలు, సేల్స్ దుకాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
