AP Governor: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం (మార్చి 23) ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి హుటాహుటీన తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు గవర్నర్‌కు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజిర్‌కు వైద్య పరీక్షలు చేసి, ఎండోస్కోపీ నిర్వహించినట్లు సమాచారం..
విజయవాడ, మార్చి 24: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం (మార్చి 23) ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి హుటాహుటీన తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు గవర్నర్‌కు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైద్య పరీక్షలు చేసి, ఎండోస్కోపీ నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) భద్రతా సిబ్బంది తెలియజేశారు.
గవర్నర్ అశ్వస్థతకు గురైన వెంటనే సత్వర చర్యలు తీసుకున్నామని, సత్వర వైద్య సదుపాయాన్ని అందించినట్లు తెలిపారు. కాగా, గవర్నర్ హఠాత్తుగా అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు ఏపీ రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
గవర్నర్ అబ్దుల్ నజిర్ ఏడాదికాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. గతంలో 2017 నుంచి 2023 వరకు ఆయన సుప్రీం కోర్టులో జడ్జిగా పని చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.