Andhra Pradesh : ఉద్యోగ సంఘాలతో ప్రభత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
ఉద్యోగ సంఘాలతో ప్రభత్వ చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సమ్మె నిర్ణయాన్ని ఉద్యోగులు ఉపసంహరించుకున్నారు.
Andhra Pradesh : ఉద్యోగ సంఘాలతో ప్రభత్వ చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సమ్మె నిర్ణయాన్ని ఉద్యోగులు ఉపసంహరించుకున్నారు. ఫిట్ మెంట్ 23 శాతం యధాతధంగా ఉండనుంది. అదేవిధంగా ఐఆర్ రికవరీ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు ఉద్యోగులు. త్వరలోనే పీఆర్సీ నివేదికను వెల్లడిస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. పీఆర్సీ పాత పద్దతితో ఐదేళ్లుగా నిర్ణయించామని తెలిపారు సజ్జల. ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ వర్తింపుపై విడిగా ఉత్తర్వులు జరీ చేశాం అన్నారు సజ్జల. జనవరి నుంచి కొత్త హెచ్ ఆర్ ఏ ను అమలు చేస్తామని తెలిపారు సజ్జల. అదేవిధంగా పాత పద్దతిలోనే సీసీఏ ను కొనసాగించనున్నారు.
గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయనున్నారు. అలాగే హెచ్ ఆర్ ఏశ్లాబ్స్ లో మార్పులు చేయనున్నారు. 50వేల జనాభా ఉన్న చోట 11 వేల సీలింగ్ తో 10 శాతం , 2 లక్షల జనాభా ఉన్న చోట 16శాతం హెచ్ ఆర్ ఏ, అదేవిదంగా సచివాలయ , హెచ్ వోడీల కు జూన్ 2024నాటికీ 24 శాతం, జిల్లా కేంద్రాల్లో 16శాతం హెచ్ ఆర్ ఏ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 4 జేఏసీల తరపున సమ్మె విరమణ చేశారు. నల్ల బ్యాడ్జ్ లను తొలగించి సమ్మెను విరమించారు ఉద్యోగులు. మెజార్టీ సభ్యుల నిర్ణయంతో సమ్మెను వికిరమిస్తున్నామని,ఉపాధ్యాయుల అంశాన్ని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదని జేఏసీ లీడర్ బండి శ్రీనివాస్ రావు తెలిపారు.