Hindupur: బాలకృష్ణ, వైసిపీ నేతల మధ్య కొత్త జిల్లా చిచ్చు.. బాలయ్య వ్యాఖ్యలకు రాప్తాడు ఎమ్మెల్యే కౌంటర్
Hindupur: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో కొత్త జిల్లాల (AP New District)ప్రకటన అనంతరం పలు వివాదాలు డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. జిల్లా పునర్విభజన, జిల్లా కేంద్రం, పేర్లు వంటి డిమాండ్స్..
Hindupur: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో కొత్త జిల్లాల (AP New District)ప్రకటన అనంతరం పలు వివాదాలు డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. జిల్లా పునర్విభజన, జిల్లా కేంద్రం, పేర్లు వంటి డిమాండ్స్ భారీగా వినిపిస్తున్నాయి. ఈ నేపద్యంలో అనంతపురం జిల్లాలోని హిందూపురాన్ని కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ బాగా వినిపిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని జిల్లా ముఖ్య కేంద్రంగా ప్రకటించడంపై హిందూపుర ప్రజలు, నేతలు మండిపడుతున్నారు. తమ ప్రాంతాన్నిజిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ(MLA Balakrishna) డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ, వైసిపీ నేతల మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ మోసపూరిత పనులు మానుకోవాలని హితవు పలికారు. అసలు బాలకృష్ణకు సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడం ఇష్టం ఉందా లేదా అంటూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. హిందూపురం ప్రజలకు అనంతపురం కంటే పుట్టపర్తి చాలా దగ్గరగా ఉంటుందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే.. తెలపమని చెప్పామని సూచించిన సంగతి గుర్తు చేశారు. ఎన్టీఆర్ అంటే అందరికి అభిమానం ఉంది.. అందుకనే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేశామని అన్నారు ప్రకాష్ రెడ్డి.
అసలు ఎన్టీఆర్ దూషించింది, వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే.. ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా ఎన్ని కోట్ల మందికి భోజనం పెట్టారని గత ప్రభుత్వాన్ని.. టిడిపీ నేతల తీరుని ప్రశ్నించారు. బాలకృష్ణ, కొంతమంది టిడిపీ నేతలు హిందూపురంపై ప్రేమ ఉన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తారంటు ప్రశ్నించారు. హిందూపురానికి వైఎస్ వచ్చే వరకూ నీరు ఇవ్వలేకపోయరని… ఇప్పుడు జిల్లా కేంద్రం పేరుతో ఆందోళన ఎందుకు చేస్తున్నారంటూ ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read: