AP Corona Updates: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్నటికి ఇవాళ్టికి తేడా ఏంతంటే..!

Andhra Pradesh Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్నటి కంటే ఇవాళ చాలా తక్కువ సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

AP Corona Updates: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్నటికి ఇవాళ్టికి తేడా ఏంతంటే..!
Follow us

|

Updated on: Feb 05, 2022 | 6:51 PM

Andhra Pradesh Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్నటి కంటే ఇవాళ చాలా తక్కువ సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 29,838 శాంపిల్స్ ని పరీక్షించగా 3,396 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య.. 23,00,765 లకు చేరింది. కరోనా కారణంగా అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇక గడిచిన 24 గంటల్లో 13,005 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,07,364 లకు చేరింది. ఇక కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,655 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఆ జిల్లాలో ఎక్కువ కేసులు.. ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 516 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత కృష్ణా జిల్లాలో 494 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం – 147, చిత్తూరు – 252, గుంటూరు – 360, వైఎస్ఆర్ కడప – 204, కర్నూలు – 205, నెల్లూరు – 197, ప్రకాశం – 240, శ్రీకాకుళం – 46, విశాఖపట్నం – 281, విజయనగరం – 56, పశ్చిమ గోదావరి – 398 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

నిన్నటితో పోలిస్తే తగ్గిన కేసులు.. ఏపీలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల క్రమంగా తగ్గుతోంది. నిన్న నమోదైన కేసుల సంఖ్య.. ఇవాళ నమోదైన కేసుల సంఖ్యకు చాలా తేడా కనిపించింది. నిన్న 4,198 కేసులు నమోదవగా, ఇవాళ 3,396 కేసులు నమోదయ్యాయి. అంటే నిన్నటికి, ఇవాళ్టికి 802 కేసులు తేడా ఉంది.

కరోనా సమాచారం మీ చేతుల్లోనే: ● కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేయడి. ● స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు ● 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు ●వెబ్ సైట్ ద్వారా డాక్టర్ గారిని వీడియో కాల్ లో సంప్రదించి, కరోనాకు సంబంధించిన వైద్య సహాయం పొందవచ్చు. ● కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. ఈ లింక్ నుంచి ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, రాష్ట్రలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి.

Also read:

Hindupur: బాలకృష్ణ, వైసిపీ నేతల మధ్య కొనసాగుతున్న మాటల వార్.. బాలయ్య మోసపూరిత పనులు మానుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే హితవు..

IND vs WI: 10 ఏళ్ల సెహ్వాగ్ రికార్డుకు బీటలు.. బ్రేక్ చేసే లిస్టులో ఎవరున్నారో తెలుసా?

Shilpa Shetty: రూ. కోట్ల విలువైన ఆస్తులను శిల్పాకు ట్రాన్స్‌ఫర్‌ చేసిన రాజ్‌కుంద్రా.. అదే కారణమంటూ..

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.