Andhra Pradesh: సత్తా లేని నాయకుడు అంటూ.. మాజీ సీఎం సోదరుడిపై ఎంపీ ఫైర్..
Andhra Pradesh: మాజీ ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. కలికిరి మండలం మాజీ సీఎం కిరణ్ సొంత
Andhra Pradesh: మాజీ ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. కలికిరి మండలం మాజీ సీఎం కిరణ్ సొంత పంచాయతీ పతేఘడ్‌లో పర్యటించిన ఎంపీ మిథున్ రెడ్డి.. నల్లారి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సత్తా లేని నాయకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తండ్రి అమర్నాథరెడ్డి గొప్ప నాయకుడు అని, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఎప్పుడూ దిగజారి మాట్లాడలేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఎత్తే అర్హత కూడా కిషోర్ కుమార్‌కు లేదన్నారు. అన్న పేరు చెప్పి ఇప్పటికీ కిషోర్ కుమార్ రెడ్డి సెటిల్మెంట్స్ చేస్తున్నాడని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ఏ వ్యాపారాలు చేసి కిషోర్ కుమార్ రెడ్డి వందల కోట్లు సంపాదిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషోర్ కుమార్ రెడ్డి ఒక ఐరన్ లెగ్ అని, ఆయన ఎక్కడ కాలు మోపినా టీడీపీకి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు ఎంపీ మిథున్ రెడ్డి.
Also read:
Science: దురద సమయంలో గోక్కోవడం ద్వారా హాయిగా ఉంటుంది.. ఎందుకో తెలుసా?
Dark Underarms: చంకలో నల్ల మచ్చలు పోవాలంటే ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి..