Dark Underarms: చంకలో నల్ల మచ్చలు పోవాలంటే ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి..
Dark Underarms: ప్రతీ ఒక్కరూ ముఖం, చేతులు, కాళ్ళపై చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చంకలు, మొదలైన శరీరంలోని కొన్ని భాగాలు
Dark Underarms: ప్రతీ ఒక్కరూ ముఖం, చేతులు, కాళ్ళపై చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చంకలు, మొదలైన శరీరంలోని కొన్ని భాగాలు దుస్తులతో కప్పబడి ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోరు. ఫలితంగా చంకల్లో ఒకరకమైన నల్లటి మచ్చ ఏర్పడుతుంది. అయితే, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించినప్పుడు ఆ డార్క్ అండర్ ఆర్మ్స్ కనిపిస్తుంటాయి. వాస్తవానికి అండర్ ఆర్మ్ ( Lighten Dark Underarms ) చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దాంతో పిగ్మెంటేషన్, డియోడరెంట్, స్కిన్ ఇన్ఫెక్షన్లు మొదలైన అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలు సులభంగా వచ్చే ప్రమాదం ఉంది. మరి చంకలో ఏర్పడే నల్లటి మచ్చను తొలగించడానికి అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిలో బేకింగ్ సోడా, కొబ్బరి నూనె మొదలైనవి ఉన్నాయి. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బేకింగ్ సోడా.. దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే బేకింగ్ సోడా చంకలో ఏర్పడే నల్లటి మచ్చను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. బేకింగ్ సోడా పేస్ట్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేయాలి. ఆ తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలా కొంతకాలం చేస్తే.. ఈ మచ్చను శాశ్వతంగా తొలగించుకోవచ్చు.
కొబ్బరి నూనే.. కొబ్బరి నూనెను దేశంలో జుట్టు, చర్మం కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది మీ చర్మంలోని నల్లదనాన్ని సహజంగా తొలగించడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. కొబ్బరి నూనెతో ప్రతిరోజూ మీ అండర్ ఆర్మ్స్ మసాజ్ చేయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆపిల్ వెనిగర్.. యాపిల్ సైడర్ వెనిగర్ కొవ్వును తగ్గించడమే కాకుండా మృతకణాలను తొలగిస్తుంది. ఇది సహజమైన క్లెన్సర్‌గా పనిచేసే తేలికపాటి ఆమ్లాలను కలిగి ఉంటుంది. 2 టీస్పూన్ల బేకింగ్ సోడా, 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేయండి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి, ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఆలివ్ నూనె.. అందాన్ని పెంచుకోవడానికి ఆలివ్ ఆయిల్ ఎప్పటి నుంచో ఉపయోగించబడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలపండి. దీన్ని ఎక్స్‌ఫోలియేటర్‌గా ఉపయోగించండి. అండర్ ఆర్మ్స్ పై అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత సాధారణ నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.
నిమ్మకాయ.. నిమ్మకాయను సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. స్నానం చేసే ముందు రోజూ అర నిమ్మకాయను నల్లగా ఉన్న ప్రదేశంలో రెండు మూడు నిమిషాల పాటు రుద్దితే చాలా తేడా కనిపిస్తుంది.
Also read:
Pushpa: రోజురోజుకూ పెరుగుతోన్న పుష్ప క్రేజ్.. రైల్వే శాఖ కూడా బన్నీ సినిమాను వాడేసిందిగా..
Viral Video: వామ్మో.. ఇదేం టాలెంట్ రా బాబు.. ఊ అంటావా పాటను ఇలా చేశారేంటీ..