Andhra Pradesh: కీచక పాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో పోలీసుల చేతికి కీలక ఆధారాలు..

Andhra Pradesh: విశాఖపట్నం జిల్లాలో వెలుగుచూసిన కీచక పాస్టర్ అనిల్ అలియాస్ ప్రేమ్ దాస్ లైంగిక వేధింపుల వ్యవహారంలో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు.

Andhra Pradesh: కీచక పాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో పోలీసుల చేతికి కీలక ఆధారాలు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 05, 2022 | 9:59 PM

Andhra Pradesh: విశాఖపట్నం జిల్లాలో వెలుగుచూసిన కీచక పాస్టర్ అనిల్ అలియాస్ ప్రేమ్ దాస్ లైంగిక వేధింపుల వ్యవహారంలో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఆధ్యాత్మికత ముసుగులో మాయమాటలతో ఓ యువతిని ట్రాప్ చేసి లోబరుచుకున్నట్టు నిర్ధారించారు. వివరాల్లోకెళితే.. విజయవాడకు చెందిన అనిల్ కొన్నేళ్ల క్రితం విశాఖ జిల్లాకు వచ్చాడు. పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో ప్రేమ స్వరూపిని ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా సిద్ధం చేశాడు. అందులో దేవుడి పేరు చెప్పి ఉపదేశాలు మొదలుపెట్టి పాస్టర్ గా చెప్పుకుంటున్న ప్రేమ దాస్.. అందర్నీ ఎట్రాక్ట్ చేయడం ప్రారంభించాడు. చానల్లో Subscriberz గా ఉన్నవారిని ఒక్కొక్కరిని మెల్లగా మాయమాటలతో తనవైపు ఆకర్షించాడు. దీంతోపాటు కొన్ని పుస్తకాలు ప్రచురించి.. సభలు సమావేశాలు కూడా పెట్టేవాడు. దేవుడి పేరుతో చందాలు కూడా వసూలు చేసేవాడు. తన మాటలకు ఎట్రాక్ట్ ఆయన కొంతమంది.. అతని దగ్గరకు వచ్చేసారు. దీంతో తన దగ్గరికి వచ్చిన వారిని మెల్లగా మాయమాటలతో ట్రాప్ చేయడం ప్రారంభించినట్టు నిర్ధారించారు పోలీసులు.

ఇక కోదాడకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసేది. 2018 లో ఈ ప్రేమ దాసు రచించిన పుస్తకం చూసి ప్రేమ్ దాస్ కు కాల్ చేసిన పాపానికి ఆమెను ట్రాప్ చేయడం ప్రారంభించాడు. పాయకరావు పేటలో ఉన్న తన మినిస్ట్రీస్ కి వచ్చి దేవుడు సేవ చేయాలని మాటల్లో పెట్టి మాయ చేసాడు. అప్పటి నుంచి తన దగ్గరే ఉంచుకుని ఆమెను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.

ఇదిలాఉంటే మరో మహిళతో కూడా ఈ పాస్టర్ సహజీవనం చేసేవాడని తేల్చారు పోలీసులు. యువతిని ట్రాప్ చేసే వ్యవహారంలో ఆమె కూడా పాస్టర్ అనిల్ కు సహకరించినట్లు గుర్తించారు. ఓవైపు రాజేశ్వరితో సహజీవనం చేస్తూనే.. మరోవైపు ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాడు ఈ పాస్టర్. అంతేకాదు బూతు చిత్రాలు కూడా పంపించమని చెప్పేవాడు. తాను యువతిని శారీరకంగా, లైంగికంగా వేధించడంతో పాటు సహజీవనం చేస్తున్న మహిళ తమ్ముడుతో ఆమెకు బలవంతపు పెళ్లి కూడా చేశాడు. అంతేకాదు ఓసారి అబార్షన్ కూడా బలవంతంగా చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ టార్చర్ భరించలేకపోయిన యువతి బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో పాస్టర్ పాపాల పుట్ట బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడిగా పాస్టర్ అనిల్ తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని కేసులో చేర్చారు.

మరోవైపు పాస్టర్ ఆధ్యాత్మికత ముసుగులో నడుపుతున్న ఆశ్రమంలో 27 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. పాస్టర్ మాయమాటల్లో పడి వీరు తమ కుటుంబాలకు దూరమయ్యారు. అయితే వీరందరినీ ఐసీడీఎస్ రెవెన్యూ అధికారులు కౌన్సెలింగ్ చేశారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించి.. కొంతమందిని తూర్పు గోదావరి జిల్లాకు వారి కుటుంబ సభ్యులు అప్పగించగా.. మిగిలిన వారిని విశాఖలో ఐసిడిఎస్ అధికారులు వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. ఇక పాస్టర్ అనిల్ తో పాటు అతనికి సహకరించిన నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక సమాచారాన్ని సేకరించారు. ఏ క్షణంలోనైనా ఈ నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉంది.

Also read:

PM Modi: తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పీఎం మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Viral Video: మెట్రో స్టేషన్‌లో మొబైల్‌ చూస్తూ ట్రాక్‌పై పడిపోయిన ప్రయాణికుడు.. ప్రాణాలను కాపాడిన CISF జవాన్

Rahul Ramakrishna: అంతా ఒట్టిదే తూచ్.. జోక్ చేశా అంటున్న నటుడు.. మండిపడుతున్న నెటిజన్లు