AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Ramakrishna: అంతా ఒట్టిదే తూచ్.. జోక్ చేశా అంటున్న నటుడు.. మండిపడుతున్న నెటిజన్లు

Rahul Ramakrishna:కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. పైగా చిన్న వయసు.. అయితే సడెన్ గా నేను సినిమాలకు గుడ్ బై చెబుతున్నా.. 2022 ఏడాది సినిమాల్లో చివరి సంవత్సరం. ఇకపై సినిమాలు చేయనని నటుడు రాహుల్‌..

Rahul Ramakrishna: అంతా ఒట్టిదే తూచ్.. జోక్ చేశా అంటున్న నటుడు.. మండిపడుతున్న నెటిజన్లు
Rahul Ramakrishna
Surya Kala
|

Updated on: Feb 05, 2022 | 9:37 PM

Share

Rahul Ramakrishna:కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. పైగా చిన్న వయసు.. అయితే సడెన్ గా నేను సినిమాలకు గుడ్ బై చెబుతున్నా.. 2022 ఏడాది సినిమాల్లో చివరి సంవత్సరం. ఇకపై సినిమాలు చేయనని నటుడు రాహుల్‌ రామకృష్ణ( Rahul Ramakrishna) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది సంచలనం సృష్టించాడు. రాహుల్ నిర్ణయం చేసిన ట్వీట్‌ అటు సోషల్‌మీడియాలోనే కాదు, చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌ అయింది. అయితే మళ్ళీ తాను రిటైర్మంట్ నిర్ణయం పై రాహుల్ స్పందించాడు. తాను సినిమాలకు ఈ ఏడాది గుడ్ బై చెబుతున్నట్లు చేసిన ట్వీట్ జోక్ అని అంతా తూచ్ అన్నాడు. తాను జోక్‌ చేశానని.. సినిమాల్లో నటించడం వలన భారీ పారితోషకం, విలాసవంతమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలు వస్తున్నాయని.. అవన్నీ ఎందుకు వదులుకుని సినిమాలకు గుడ్ బై చెబుతా అంటూ పోస్ట్ చేశాడు. తాను రిటైర్మెంట్‌ ప్రకటించానని.. స్నేహితులు ఫోన్‌ చేసి మరీ చెప్పటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ రాహుల్‌ రామకృష్ణ ట్వీట్‌ చేశాడు.

రాహుల్ ఇచ్చిన క్లారిటీ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అసలు ఎందుకు ట్వీట్‌ చేయాలి.. ఇప్పుడు మళ్ళీ అది జోక్.. నేను నా సుపర్బ్ కెరీర్ ను ఎందుకు వదులుకుంటా అని అనాలి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు నువ్వు సినిమాల్లో కామెడీ సినిమాల్లో చెయ్‌.. . ట్విటర్‌లో కాదు అన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు. రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో నటనతో వరస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకుని వెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి, అల వైకుంఠ పురం వంటి సూపర్ హిట్ సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. తాజాగా ఎన్టిఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లొనూ రాహుల్ కనిపించనున్నాడు.

Also Read:  Ravi Teja: ఖిలాడీతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న మాస్ మహారాజా రవితేజ.. హిందీ ప్రేక్షకులను కూడా నవ్విస్తాడంటున్న నిర్మాతలు..